వారంపాటు రోజుకు 14 గంటలు పని చేసిన డెలివరీ ఏజెంట్.. చివరికి వ్యాన్‌లోనే మరణం

By Mahesh KFirst Published Nov 25, 2022, 12:41 PM IST
Highlights

యూకేకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ సందర్భంగా నెలకొన్న డిమాండ్‌తో రోజుకు 14 గంటలపాటు సరుకులు డెలివరీ చేశాడు. ఇలా ఓ వారంపాటు రోజుకు 14 గంటలు పని చేసినట్టు తెలిసింది. చివరికి బుధవారం ఉదయం ఆయన వ్యాన్‌లోనే ఊపిరిలేకుండా పడిపోయాడు.
 

న్యూఢిల్లీ: మార్కెట్ డిమాండ్ ఆధారంగా పని చేసే కంపెనీలు ఆయా సీజన్‌లో తమ వర్కర్ల ముందు ఎక్కువ పని పెడతాయి. అదీ యూకే వంటి దేశంలో క్రిస్మస్ రానున్న తరుణంలో డెలివరీ ఏజెంట్లకు ఊహించలేనన్ని ఆర్డర్‌లు వచ్చి పడతాయి. డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వ్యాన్ పెట్టుకున్న ఓ వ్యక్తి ఈ ఆర్డర్‌లను కస్టమర్లకు అందించడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేశాడు. రోజుకు 14 గంటలపాటు ఒక వారం రోజులు పని చేశాడు. చివరకు ఆ వ్యాన్‌లోనే హ్యాండిల్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

యూకేకు చెందిన డెలివరీ ఏజెంట్ వారెన్ నోర్టన్ (49) డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్‌ల డెలివరీ చేయడానికి తన వ్యాన్ పెట్టుకుని జీవిస్తున్న సెల్ఫ్ ఎంప్లాయీ. రెండేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. బ్లాక్ ఫ్రైడే తరుణంలో విపరీతమైన ఆర్డర్‌లు రావడంతో విరామం ఎరుగకుండా పని చేశాడు. రోజులో 14 గంటలు ఆర్డర్‌లు డెలివరీ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అలా ఓ వారంపాటు డెలివరీ చేస్తూనే ఉన్నాడు. బుధవారం ఉదయం ఆ పని ఒత్తిడితోనే మరణించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: పనితప్ప వేరే ధ్యాసే లేదా..? ప్రాణానికే ప్రమాదం..!

వ్యాన్‌లోపల హ్యాండిల్ పైనే వారెన్ నోర్టన్ ఒరిగి ఉన్నాడు. కొలీగ్స్ చూసి బహుశా అతను నిద్రపోతున్నాడేమో అని తొలుత అనుకున్నారు. అందుకే ఆయన వైపు ఉన్న వ్యాన్ విండోను నాక్ చేశారు. కానీ, ఆయన ఉలుకలేదు, పలుకలేదు. విండోను ఎంత బాదిన స్పందించకపోవడంతో చివరకు ఆ విండోను పగులగొట్టి డోర్ ఓపెన్ చేశారు. నోర్టన్ బాడీ కారులో నుంచి సరాసరి రోడ్డుపై పడిపోయింది. ఆయనకు సీపీఆర్, ఇచ్చారని,డిఫైబ్రిలేటర్ కూడా యూజ్ చేసినట్టు ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. కానీ, ఆయన బతుకలేడని, స్పాట్‌లోనే మరణించినట్టు తెలిపారు. 

కాగా, ఆ కంపెనీ మాత్రం పని ఒత్తిడి ఆరోపణలను కొట్టేసింది. నోర్టన్ ఒక సెల్ఫ్ ఎంప్లాయీ డ్రైవర్ అని పేర్కొంటూ ఆయన బంధుమిత్రులకు సానుభూతి తెలిపింది. బ్లాక్ ఫ్రైడే కారణంగా నోర్టన్ లాంగ్ అవర్స్ పని చేశాడని తెలుస్తున్నప్పటికీ డీపీడీ కంపెనీ మాత్రం అది అవాస్తవం అని పేర్కొంది. వారానికి ఐదు రోజులు మాత్రమే నోర్టన్ పని చేశాడని, ఆ రోజుల్లోనూ చట్టానికి లోబడినన్ని గంటలు మాత్రమే పని చేశాడని వివరించింది.

click me!