స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ఉగాండా అత్యంత కఠిన చట్టం.. ఆ ఉల్లంఘనలకు మరణశిక్షే.. !

By Sumanth KanukulaFirst Published Mar 22, 2023, 11:42 AM IST
Highlights

ఆఫ్రికన్ దేశమైన ఉగాండా పార్లమెంటు స్వలింగ సంపర్కుల గుర్తింపును నేరంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఉగాండా పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. 

ఆఫ్రికన్ దేశమైన ఉగాండా పార్లమెంటు అత్యంత కఠినమైన స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఉగాండా పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం.. ఇప్పటికే ఉగాండాలో చట్టపరమైన వివక్ష, హింసను ఎదుర్కొంటున్న ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకోవడానికి అధికారులకు విస్తృత అధికారాలను అందజేస్తుంది. చట్టం ప్రకారం.. తీవ్రమైన ఉల్లంఘనలకు మరణశిక్ష విధించేందుకు కూడా అవకాశం కల్పించారు. ఎల్‌జీబీటీక్యూ+గా గుర్తించే వ్యక్తులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. 

ఇక, ఉగాండాతో సహా 30కి పైగా ఆఫ్రికన్ దేశాలు స్వలింగ సంబంధాలను ఇప్పటికే నిషేధించాయి. హక్కుల సమూహం హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి, క్వీర్ (ఎల్‌జీబీటీక్యూ)గా గుర్తించడాన్ని నిషేధించిన మొదటి చట్టంగా కొత్త చట్టం కనిపిస్తుంది.

కొత్త చట్టం మద్దతుదారులు ఎల్‌జీబీటీక్యూ కార్యకలాపాల విస్తృత శ్రేణిని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది సాంప్రదాయిక, మతపరమైన ఉగాండా దేశంలో సాంప్రదాయ విలువలను కాలరాస్తుందని అన్నారు. ఇక, స్వలింగ సంపర్కంతో పాటు, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించడంపై, స్వలింగ సంపర్కంలో పాల్గొనేందుకు ప్రోత్సహించేలా కుట్ర చేయడంపై ఈ కొత్త చట్టం నిషేధిస్తుంది. ఇక, ఈ చట్టం ప్రకారం..  ఉల్లంఘనలకు పాల్పడిన వారికి తీవ్రమైన శిక్షలు విధించనున్నారు.  చట్టం ప్రకారం ఉల్లంఘనలు తీవ్రమైన స్వలింగ సంపర్కం అయితే మరణ శిక్ష విధించనున్నారు. తీవ్రమైన స్వలింగ సంపర్కం అనేది.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులతో స్వలింగ సంపర్కం లేదా నేరస్థుడు హెచ్‌ఐవీ పాజిటివ్ కలిగి ఉన్నప్పుడని చట్టం పేర్కొంది.

‘‘మా సృష్టికర్త దేవుడు ఏమి జరుగుతుందో (గురించి) సంతోషంగా ఉన్నాడు. మా పిల్లల భవిష్యత్తును రక్షించే బిల్లుకు నేను మద్దతు ఇస్తున్నాను’’ అని బిల్లుపై చర్చ సందర్భంగా చట్టసభ సభ్యుడు డేవిడ్ బహతి అన్నారు. ‘‘ఇది మన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినది. మమ్మల్ని ఎవరూ బ్లాక్ మెయిల్ చేయకూడదు. మమ్మల్ని ఎవరూ భయపెట్టకూడదు’’ అని తెలిపారు. ఇక, గే సెక్స్‌కు జైలు శిక్ష విధించనున్నారు. 

ఇక, బిల్లుపై చేయడానికి ఈ చట్టం అధ్యక్షుడు యోవేరి ముసెవెనీకి పంపబడుతుంది. అయితే ముసెవేని ప్రస్తుత ప్రతిపాదనపై వ్యాఖ్యానించలేదు. కానీ అతను చాలాకాలంగా ఎల్‌జీబీటీక్యూ హక్కులను వ్యతిరేకించారు. అయితే 2013లో ఎల్‌జీబీటీక్యూ వ్యతిరేక చట్టంపై సంతకం చేశారు. దీనిపై పాశ్చాత్య దేశాల నుంచి పెద్ద  ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే దీనిని దేశీయ న్యాయస్థానం విధానపరమైన కారణాలతో కొట్టివేసింది. 

ఇక, పాఠశాలల్లో విద్యార్థులను స్వలింగ సంపర్కంలో చేర్చుకుంటున్నారని ఎల్‌జీబీటీక్యూ వ్యక్తులపై ఉగాండాలోని మత పెద్దలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో యువ బాలికలను అసహజమైన లైంగిక పద్ధతులకు గురిచేస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై అధికారులు తూర్పు ఉగాండా జిల్లా జింజాలో ఒక మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. తదనంతరం ఆమెపై స్థూలమైన అసభ్యత అభియోగాలు మోపబడ్డాయి. ఆమె ప్రస్తుతం విచారణ కోసం జైలులో ఉంది.
 

click me!