కరోనా ఎఫెక్ట్, స్వదేశాలకు తీసుకెళ్లకపోతే చర్యలు: యూఏఈ హెచ్చరిక

By narsimha lodeFirst Published Apr 13, 2020, 12:52 PM IST
Highlights
కరోనా వైరస్ ను పురస్కరించుకొని  తమ దేశంలో చిక్కుకుొన్న పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకొంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని కూడ ప్రకటించింది.
దుబాయ్: కరోనా వైరస్ ను పురస్కరించుకొని  తమ దేశంలో చిక్కుకుొన్న పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకొంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని కూడ ప్రకటించింది.

యూఏఈలో చిక్కుకొన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టులు వస్తే వారిని స్వదేశాలకు పంపేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని తేల్చి చెప్పారు యూఏఈ అధికారులు. ఈ మేరకు అన్ని దేశాల అధికారులకు సమాచారం పంపారు. వర్క్ వీసాల  నిబంధనలను మరింత కఠినతరం చేసేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

కరోనా నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకొంది. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం పంపినా కూడ ఆయా దేశాలు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకొంది యూఏఈ.

యూఏఈలో ఇతర దేశాల నుండి పనుల కోసం వచ్చిన వారే అధికంగా ఉంటారు. యూఏఈ జనాభా 90 లక్షల మంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమ స్వదేశాలకు వెళ్లే వారిని పంపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని కూడ యూఏఈ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

also read:కరోనా దెబ్బ: అమెరికాలో చిక్కుకొన్న 2.5 లక్షల ఇండియన్ స్టూడెంట్స్

కరోనా వల్ల యూఏఈలో 20 మంది మరణించారు. 3736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు యూఏఈ పలు చర్యలను తీసుకొంది. ఇందులో భాగంగానే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేసింది.
click me!