ముక్కునుంచి మాస్క్ జారిందని.. విమానం నుంచే దించేశారు..

By AN TeluguFirst Published Jan 28, 2021, 11:25 AM IST
Highlights

కరోనా నిబంధలన పేరుతో అమెరికాకు చెందిన ఓ ఎయిర్‌లైన్స్ అన్యాయంగా ఓ కుటుంబాన్ని విమానం నుంచి దించేసింది. అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన 20 మంది అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. 

కరోనా నేపథ్యంలో అమెరికాలో విమానప్రయాణాల్లో నిబంధనలు కఠినతరం చేశారు. విమానంలో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వీరంతా పాటించారు కూడా. కుటుంబ సభ్యులంతా ఫేస్ మాస్క్ ధరించగా.. ఒక వ్యక్తి ఫేస్ మాస్క్ మాత్రం కొంచెం కిందకు జారింది. 

దీంతో ఫేస్‌మాస్క్ నిబంధనలు పాటించలేదంటూ విమానసిబ్బంది కుటుంబం మొత్తాన్ని విమానం నుంచి దించేశారు. ఫేస్‌మాస్క్ ఒక అంగుళం మాత్రమే కిందకు జారిందని వెంటనే గమనించి తాను మళ్లీ సరిచేసుకున్నానని స్కాట్ విల్సన్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. 

అయినప్పటికి సిబ్బంది అన్యాయంగా కుటుంబం మొత్తాన్ని విమానం నుంచి దించేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తమ నిబంధనలను పాటించనందుకే కుటుంబం మొత్తాన్ని విమానం నుంచి దించేశామని సిబ్బంది చెబుతోంది.

click me!