లవ్ ఫెయిల్యూర్ తో పగిలిన హృదయాన్ని అతికించటం, ఆ మనసుకు ఊరట కలిగించడం అంత ఈజీ కాదు. బ్రేకప్, లవ్ ఫెయిల్ పేరేదైనా కావచ్చు. ఆ ప్రేమికులు బాధనుండి తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది.
లవ్ ఫెయిల్యూర్ తో పగిలిన హృదయాన్ని అతికించటం, ఆ మనసుకు ఊరట కలిగించడం అంత ఈజీ కాదు. బ్రేకప్, లవ్ ఫెయిల్ పేరేదైనా కావచ్చు. ఆ ప్రేమికులు బాధనుండి తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది.
నచ్చిన మనిషి నిర్థాక్షిణ్యంగా వదిలేసిన ఆ బాధను మర్చిపోవాలంటే మనిషి మనసుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయినా కొన్నిసార్లు సక్సెస్ కాలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ఇంకొందరు జీవితాన్నే త్యాగం చేస్తుంటారు. అయితే ఇలాంటి భగ్న ప్రేమికులు తమ బాధనుండి బయటపడడానికి అమెరికాలోని ఓ జూ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
undefined
ప్రేమికుల దినోత్సవం దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా, టెక్సాస్‌లోని శాన్ ఆంటానియో జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ‘‘ క్రై మీ ఏ కాక్‌రూచ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
జూలోని బొద్దింకలు, ఎలుకలకు తమ మాజీల పేర్లు పెట్టుకునే, ప్రేమికుల రోజున వాటిని వేరే జంతువులకు ఆహారంగా వేసే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం బొద్దింకకు రూ. 370, ఎలుకకు రూ.1800లు చెల్లించాల్సి ఉంటుంది.
మనం బహుమతిగా ఇచ్చే వీటిని ఇతర జంతువులకు ఆహారంగా వేస్తారు. శాకాహార జంతువులకు శాకాహారం బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ఐదు డాలర్లు (370 రూపాయలు) చెల్లించాలి. ఇదేదో బాగున్నట్టుంది కదా.. దీంతో వదిలిపోయారన్న కసి తీరుతుంది. మనసు కాస్త శాంతిస్తుంది.