సముద్రంలో ఘోర ప్రమాదం: లిబియాలో 57 మంది మృతి

By narsimha lodeFirst Published Jul 27, 2021, 11:10 AM IST
Highlights


లిబియాలో ప్రమాదం చోటు చేసుకొంది. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 57 మంది మరణించారు. బోటులో టెక్నికల్ సమస్యతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా పడవ మునిగిందని అధికారులు తెలిపారు.

ట్రిపోలి: లిబియాలో చోటు చేసుకొన్న పడవ ప్రమాదంలో 57 మంది మరణించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బోటు మునిగిపోయిందని అధికారులు తెలిపారు. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు  బోల్తాపడింది.  ఈ ఘటనలో 57 మంది మరణించారని యూఎస్ మైగ్రేషన్ అధికారులు ప్రకటించారు. 

ఖుమ్స్ నుండి ఈ పడవ బయలుదేరింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి మెహ్లీ ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందినవారున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బోటులో 75 మంది ప్రయాణం చేస్తున్నారు.  ఇంజన్ లో టెక్నికల్ సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయింది. 

వాతావరణంలో చోటు చేసుకొన్న మార్పులతో సముద్రంలోనే పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఐరోపాలో మెరుగైన జీవనం కోసం వలసదారులు, శరణార్దులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. 
 

click me!