Russia-Ukrain: ఉక్రెయిన్‌ తో యుద్ధం ముగించేందుకు రెడీ..ట్రంప్‌,పుతిన్‌ చర్చలు!

Published : May 20, 2025, 04:54 AM IST
Putin/Zelenskyy

సారాంశం

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు ట్రంప్‌, పుతిన్‌ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కాల్పుల విరమణపై కీలక చర్చలు జరిపారు.

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య ఫోన్‌ ద్వారా కీలక చర్చలు జరిగాయి. ఈ సంభాషణ దాదాపు రెండు గంటలపాటు సాగింది. ఈ కాల్‌ తర్వాత పుతిన్‌ చేసిన ప్రకటన ప్రకారం, రష్యా శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

ట్రంప్‌తో  పుతిన్‌

టర్కీ మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు ఇటీవల ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో మాట్లాడిన పుతిన్‌, అమెరికా సహకారంతో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందన్న ఆశ వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రక్రియకు కొన్ని నిబంధనలు, సమయ పరిమితులు ఉండబోతున్నాయని కూడా తెలిపారు.రష్యా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నప్పటికీ  కాస్తా గడువు అవసరం అని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌, దానికి మద్దతు ఇచ్చే దేశాలు కనీసం 30 రోజుల కాల్పుల విరమణను తక్షణమే అమలు చేయాలని కోరాయి.

అమెరికా మద్దతు

ఈ సందర్భంగా ట్రంప్‌ను పుతిన్‌ ప్రత్యేకంగా అభినందించారు. శాంతి చర్చలకు అమెరికా మద్దతు ఇవ్వడం ద్వారా ఈ యుద్ధానికి పరిష్కారం దొరకవచ్చని ఆశించారు. ట్రంప్‌ కూడా తన సోషల్‌మీడియా పోస్ట్‌లో ఈ కాల్‌ సంతృప్తికరంగా సాగిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్‌ దేశాల నేతలతో కూడా ఈ చర్చలపై ట్రంప్‌ మాట్లాడినట్లు చెప్పారు.అయితే పుతిన్‌ ఉద్దేశాలు నిజాయితీతో ఉన్నాయా అన్నదానిపై యూరోపియన్‌ దేశాల నేతల్లో అనుమానాలు నెలకొన్నాయి. 

2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికి మూడేళ్లు పూర్తవుతుంది. వేల మంది మరణించారు, భారీ ఆస్తినష్టం జరిగింది. ఉక్రెయిన్‌లో పలు నగరాలు పూర్తిగా నాశనమయ్యాయి.ప్రస్తుతం ఇరుపక్షాలూ చర్చలు ప్రారంభించినప్పటికీ, శాంతి స్థాపనకు ఇంకా చాలామంది ఒప్పందాలపై సమ్మతించాల్సి ఉంది. అయినా, ట్రంపు, పుతిన్‌ మధ్య జరిగిన తాజా చర్చల వల్ల ఈ యుద్ధానికి ముగింపు కనిపించే అవకాశాలు పెరిగాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే