రోడ్డు ప్రమాదం.. గర్భంలోంచి ఎగిరిపడ్డ శిశువు.. తల్లి మృతి

Published : Jul 30, 2018, 12:57 PM IST
రోడ్డు ప్రమాదం.. గర్భంలోంచి ఎగిరిపడ్డ శిశువు.. తల్లి మృతి

సారాంశం

అప్పుడప్పుడు మన ఊహకి కూడా అందని వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి గర్భంలోంచి ఎగిరిపడ్డ ఓ శిశివు ప్రాణాలతో బయటపడటం అక్కడి వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

అప్పుడప్పుడు మన ఊహకి కూడా అందని వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి గర్భంలోంచి ఎగిరిపడ్డ ఓ శిశివు ప్రాణాలతో బయటపడటం అక్కడి వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రెజిల్‌లో చెక్కల లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ నిండుచూలాలు కూడా చిక్కుకుంది.

చెక్క ముక్కలు ఆమెపై పడటంతో ఆ బరువుకు మహిళ కడుపుపై ఒత్తిడిపడింది.. దీంతో శిశివు గర్భంలోంచి ఎగిరి కొద్ది దూరంలో పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి అక్కడికక్కడే మరణించగా.. ప్రమాదాన్ని గమనించి అక్కడికి చేరుకున్న స్థానికులకు ఆడబిడ్డ ఏడుపు వినిపించింది.. సరిగా కళ్లు కూడా తెరవని ఆ బిడ్డ అంత ఎత్తున ఎగిరిపడినా ప్రాణాలతో బయటపడటంతో ఆ పాపను మృత్యుంజయురాలిగా అభివర్ణిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక
USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే