
ఆ తెలుగు యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ పీజీ కూడా పూర్తి చేశాడు. మరిన్ని మెరుగైన అవకాశాల కోసం, స్కిల్స్ పెంచుకోవడానికి కోర్సుల్లో చేరారు. ఆ క్లాస్ కు అవుతున్న సమయంలో ఓ దొంగ చేసిన పనికి అతడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో విషాదాన్ని నింపింది.
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పీజీ చదివేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం స్కిల్స్ పెంచుకోవడానికి కొన్ని కోర్సుల్లో జాయిన్ అయ్యాడు. దీని కోసం ఆయన ప్రతీ రోజూ బైక్ పై వెళ్లి వస్తుండేవాడు.
వరంగల్ లో దంచికొడుతున్న వానలు.. పొంచి ఉన్న వరద ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన జీడబ్ల్యూఎంసీ
ఈ క్రమంలో జూన్ 26వ తేదీన కూడా తన బైక్ పై క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లాడు. అతడు బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో అటు వైపు నుంచి పోలీసులు ఓ దొంగను వెంబడిస్తున్నారు. ఆ దొంగ స్పీడ్ గా ప్రయాణిస్తూ.. కిరణ్ కుమార్ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. అక్కడి భారతీయుల సహకారంతో కిరణ్ డెడ్ బాడీ భారత్ కు చేరుకోనుంది.