అమెరికాలో దుండగుల కాల్పులు, ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : May 14, 2019, 11:05 AM ISTUpdated : May 14, 2019, 11:31 AM IST
అమెరికాలో దుండగుల కాల్పులు, ముగ్గురి మృతి

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.. వారం కిందట పాఠశాలలో విద్యార్ధులపై జరిగిన కాల్పుల ఘటనను మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.. వారం కిందట పాఠశాలలో విద్యార్ధులపై జరిగిన కాల్పుల ఘటనను మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ష్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంటి ముందు ఓ వ్యక్తి, మరో నలుగురు తుపాకీ గాయాలతో కనిపించారు.

వీరిలో ముగ్గురు అప్పటికే మరణించగా.. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వీరంతా 20 నుంచి 30 ఏళ్లలోపు నల్లజాతీయులు కావడంతో జాత్యాంహర దాడిగా పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !