స్కూల్ కి ఫస్ట్ డే.. కొడుకును నవ్వించడానికి ఆ తండ్రి ఏం చేశాడంటే...?

Published : Sep 27, 2022, 09:49 AM IST
 స్కూల్ కి ఫస్ట్ డే.. కొడుకును నవ్వించడానికి ఆ తండ్రి ఏం చేశాడంటే...?

సారాంశం

ముఖ్యంగా నవ్వుతూ స్కూల్ కి పంపాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సిందే. అయితే... ఓ వ్యక్తి మాత్రం... చాలా సింపుల్ గా.. తన కుమారుడిని నవ్వించే ట్రిక్ ని కనిపెట్టాడు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేయగా... ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది.


ఫస్ట్ డే స్కూల్ కి వెళ్లాలి అంటే ఏ పిల్లాడికైనా బాధగానే ఉంటుంది. చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లమని మారాం చేస్తూ ఉంటారు. దీంతో... పిల్లలను స్కూల్ కి వెళ్లడానికి ఒప్పించడానికి పేరెంట్స్ చాలా తిప్పలు పడాల్సిందే. ముఖ్యంగా నవ్వుతూ స్కూల్ కి పంపాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సిందే. అయితే... ఓ వ్యక్తి మాత్రం... చాలా సింపుల్ గా.. తన కుమారుడిని నవ్వించే ట్రిక్ ని కనిపెట్టాడు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేయగా... ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

అందులో.. సదరు వ్యక్తి....తన కుమారుడిని ఫస్ట్ డే స్కూల్ కి వెళ్లే ముందు.. ఓ ఫోటో తీయాలని అనుకున్నాడు. దీంతో నవ్వమని అడిగాడు. మొదటి ఫోటోలో ఆ బాలుడు.. మనస్పూర్తిగా నవ్వలేదు. ఫోటో కోసం ఆర్టిఫీషియల్ స్మైల్ ఇచ్చాడు. అయితే... ఆతర్వాత... అతను.. పూప్ అని గట్టిగా అరవడంతో... పిల్లాడు.. మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వడం గమనార్హం. ఈ రెండు ఫోటోలను కలిపి.. అతను ట్వీట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ ట్రిక్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. మరి కొందరు... తాము కూడా తమ పిల్లలకు ఇదే ట్రిక్ అప్లై చేస్తామంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. మరి కొందరేమో... పిల్లల అందమైన ఫోటోల వెనక.. పేరెంట్స్ కష్టాలు ఇలా ఉంటాయి అని  కామెంట్స్ చేయడం విశేషం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?