కెనడాలో భారీ సైబర్ దాడి: ప్రభుత్వ ఖాతాల హ్యాకింగ్

Published : Aug 16, 2020, 02:54 PM IST
కెనడాలో భారీ సైబర్ దాడి:  ప్రభుత్వ ఖాతాల హ్యాకింగ్

సారాంశం

కెనడాలో ప్రభుత్వ సేవలకు సంబంధించి వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టుగా ఆ దేశం ప్రకటించింది. కెనడాలో ఆన్ లైన్ సేవలకు సంబంధించి 30 సమాఖ్య విభాగాలు, రెవిన్యూ ఏజెన్సీ  ఖాతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

టొరంటో: కెనడాలో ప్రభుత్వ సేవలకు సంబంధించి వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టుగా ఆ దేశం ప్రకటించింది. కెనడాలో ఆన్ లైన్ సేవలకు సంబంధించి 30 సమాఖ్య విభాగాలు, రెవిన్యూ ఏజెన్సీ  ఖాతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

9,401 మంది జీసీకి ఖాతాదారుల పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించారని గుర్తించామన్నారు. వీటిని వెంటనే తొలగించినట్టుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 5,500 రెవిన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి చేశారని కెనడా ప్రభుత్వం తెలిపింది. హ్యాకింగ్ కు గురైన అకౌంటన్లను వెంటనే గుర్తించి తొలగించామని కెనడా తెలిపింది.

కెనడాలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హ్యాకింగ్ కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.ఆగష్ట్ మొదటి వారంలోనే చాలా మంది కెనడా ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హ్యాకర్లు ఈ ఖాతాల సమాచారం ఏమైనా దొంగిలించారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ