కెనడాలోని టొరంటోలో కాల్పుల కలకం, 5గురు మృతి.. ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి

By SumaBala BukkaFirst Published Dec 19, 2022, 1:23 PM IST
Highlights

టొరంటోలో జరిగిన కాల్పుల్లో.. నిందితుడు కూడా మరణించాడని స్థానిక పోలీసు చీఫ్ జిమ్ మాక్‌స్వీన్ తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

టొరంటో : కెనడాలోని టొరంటోలో కాల్పులు కలకలం సృష్టించాయి. టొరంటో నగర శివారులో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎదురు కాల్పులు జరపడంతో.. నిందితుడు కూడా మరణించాడని స్థానిక పోలీసు చీఫ్ జిమ్ మాక్‌స్వీన్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కాల్పులు అపార్ట్మెంట్ భవనంలో జరిగాయని పేర్కొన్నారు.

రాత్రి 7:20 గంటలకు, టొరంటో వాఘన్‌లోని ఓ బిల్డింగ్ లో కాల్పుల జరిగాయని సమాచారం అందిందని.. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నట్లు యార్క్ ప్రాంతీయ పోలీసు చీఫ్ జిమ్ మాక్‌స్వీన్ ఒక వార్తా సమావేశంలో తెలిపారు. "మేము వెళ్లేసరికే అనేక మంది చనిపోయిన భయంకరమైన దృశ్యం కనిపించింది" అని మాక్‌స్వీన్ చెప్పారు. కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ నటీ అరెస్టు.. ఆమె చేసిన నేరమేంటీ?

కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని ఎదురుకాల్పుల సమయంలో ఒక అధికారి కాల్చి చంపాడని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి పేరును పోలీసులు వెల్లడించలేదు. చనిపోయినవారిని వారి కుటుంబాలకు అప్పజెప్పేంతవరకు.. మృతుల వివరాలు వెల్లడించమని పోలీసులు తెలిపారు. దీనిమీద కానిస్టేబుల్ లారా నికోల్ మాట్లాడుతూ ఈ సంఘటన "నా మొత్తం సర్వీసులో నేను చూసిన అత్యంత భయంకరమైనది" అని అన్నారు.

బాధితుల్లో ఒకరి కంటే ఎక్కువమంది కాండో యూనిట్‌కు చెందినవారని తెలుస్తోంది.ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది భవనాన్ని క్లియర్ చేయడానికి, ఇంకా బాధితులు లేరని నిర్ధారించుకోవడానికి పనిచేస్తున్నారు. పోలీసులు భవనాన్ని అంతస్తుల వారీగా క్లియర్ చేయడంతో నివాసితులు గంటల తరబడి వేచి ఉన్నారు, చివరకు అర్ధరాత్రి తర్వాత వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. అయితే, అనుమానితుడు ఎందుకు కాల్పులు జరిపాడో.. దాని వెనకున్న ఉద్దేశ్యం తెలియరాలేదు. కాల్పులకు దారితీసిన పరిస్తితుల వివరాలు పోలీసులు బహిర్గతం చేయలేదు. 

click me!