ఆప్ఘనిస్తాన్... విమానం నుంచి జారిపడి ఫుట్ బాల్ ప్లేయర్ మృతి

By telugu news teamFirst Published Aug 20, 2021, 9:36 AM IST
Highlights

ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. 


ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ ని ఆక్రమించుకున్నారనే విషయం తెలియగానే.. దేశ ప్రజలు భయంతో వణికిపోయారు.  అక్కడ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంటున్నాయి. తాలిబాన్లు పెడుతున్న హింసలకు సంబంధించి రోజుకో ఘటన, వీడియోలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాలిబాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారని తెలియగానే.. ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంటున్న అమెరికా సైనిక రవాణా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని పట్టుకుని వేళ్లాడిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో అఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు జకీ అన్వారీ ఒకరు.

19 ఏళ్ల అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ స్కూల్ లో చదువుతున్నాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ యూత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్ బాల్ మీద ప్రేమ.. తాలిబన్ల చేతిలో బలవ్వకూడదన్న భయం.. అతడ్ని విమానం పైకి ఎక్కేలా చేశాయి. ఆరోజు సీ-17 ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలని భావించి… విమానం గాల్లోకి లేవగానే అక్కడి నుంచి జారిపడి చనిపోయాడు. ఆ వీడియో ఇప్పటికే ప్రపంచ దేశాలను కలచివేయగా.. చనిపోయింది ఓ ఫుట్ బాల్ ప్లేయర్ తెలిసిన తర్వాత మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.

click me!