గర్భిణీ ని కుటుంబసభ్యుల ముందే కాల్చి చంపిన తాలిబాన్లు..!

Published : Sep 06, 2021, 12:07 PM IST
గర్భిణీ ని కుటుంబసభ్యుల ముందే కాల్చి చంపిన తాలిబాన్లు..!

సారాంశం

ఓ ఆరు నెలల గర్భిణీ.. అందులోనూ ఆప్ఘనిస్తాన్ మహిళా పోలీసును అతి దారుణంగా కాల్చి చంపేశారు. 

ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారు తమ వికృత చర్యలను బయటపెడుతూనే ఉన్నారు.  తాజాగా..  ఓ ఆరు నెలల గర్భిణీ.. అందులోనూ ఆప్ఘనిస్తాన్ మహిళా పోలీసును అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఆమె కుటుంబసభ్యులు, భర్త, పిల్లల ముందే కాల్చి చంపడం గమనార్హం. బుర్ఖా వేసుకోలేదనే ఆమెను చంపేయడం గమనార్హం.

ఈ విషయాన్ని అక్కడి మీడియా తెలియజేసింది. కొన్ని సంవత్సరాల క్రితం.. తాలిబాన్లు.. ఎక్కడ చంపేస్తారో అనే భయంతో.. మహిళలు.. తమ ముఖం నుంచి పాదాల వరకు కనపడకుండా బుర్ఖాలు కొనుగోలు చేసి వాటినే ధరించేవారు. అయితే.. మళ్లీ ఇవే పరిస్థితులు ఆప్ఘనిస్తాన్ లో మొదలయ్యాయని తెలుస్తోంది.

సరిగ్గా 1990లో తాలిబాన్లు పేరు చెబితేనే మహిళలు భయపడిపోయారని.. ఇప్పుడు మళ్లీ అలానే భయపడిపోతున్నారని అక్కడి మీడియా పేర్కొంటోంది.  కాగా.. తాజాగా.. మహిళా పోలీసు అధికారిణి.. అందులోనూ గర్భిణీ అనే  కనికరం కూడా లేకుండా చంపేయడం అందరినీ కలచివేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?