ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

Published : Nov 25, 2019, 07:20 AM IST
ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

సారాంశం

ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండరుతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. ఆర్చి జిల్లా క్వారలుక్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘాన్ భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

ఈ కాల్పుల్లో ఐదుగురు ఆఫ్ఘాన్ సెక్యూరిటీ గార్డులు కూడా గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే