30 ఏళ్లు..250 మంది చిన్నారులపై అత్యాచారాలు: డాక్టర్ కీచకపర్వం, డైరీల్లో చేదు నిజాలు

By sivanagaprasad KodatiFirst Published Nov 19, 2019, 3:54 PM IST
Highlights

వైద్యో నారాయణో హరి అన్న సూక్తిని పక్కనబెట్టి... పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చే పనిచేశాడో వ్యక్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 250 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు

వైద్యో నారాయణో హరి అన్న సూక్తిని పక్కనబెట్టి... పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చే పనిచేశాడో వ్యక్తి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 250 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముప్పై ఏళ్లకు పైగా సాగిన అతని ఘాతుకాలు సీక్రెట్ డైరీల ద్వారా బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే... ఫ్రాన్స్‌కు చెందిన జోయెల్ లే స్కౌరానెక్ అనే వ్యక్తి గతంలో సర్జన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో తన పక్కింట్లో ఉంటున్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు 2017లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే జోయెల్ బంధువులు, అతడి దగ్గర చికిత్స పొందిన మరికొంతమంది యువతులు డాక్టర్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజు పదులు సంఖ్యలో జోయెల్‌పై ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులకు ఏమి అర్థం కాలేదు.

Also Read:13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

ఈ క్రమంలో దర్యాప్తు నిమిత్తం జోయెల్ ఇంటికి చేరుకుని అణువణువునా గాలించారు. ఈ తనిఖీల్లో అతని సీక్రెట్ డైరీలు బయటపడ్డాయి. వీటిలో దాదాపు 250 మంది చిన్నారుల పేర్లు ఉన్నాయి. వారిని లైంగికంగా వేధించిన తీరు, ఎలా అత్యాచారం చేసింది జోయెల్ వివరంగా రాసుకున్నాడు.

అంతేకాకుండా అతని బెడ్‌రూమ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన సీడీలు, బొమ్మలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక కోర్టు జోయెల్ కేసుపై విచారణ చేపట్టింది.

మొత్తం 250 మంది బాధితులలో 209 మంది ఆచూకీని కనుగొన్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీరిలో చాలామంది తమ చిన్నతనంలో జోయెల్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును తెలిపారు. విచారణ సందర్భంగా ఈ కేసును దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అత్యంత హేయమైన పెడోఫిలియా కేసుగా న్యాయమూర్తి అభివర్ణించారు.

Also Read:ఎంత దారుణం.. బాలికపై 8మంది అత్యాచారం

ఇందుకు అభ్యంతరం తెలిపిన జోయెల్ తరపు న్యాయవాది.. ఈ కేసులో 181 మంది మాత్రమే మైనర్లుగా ఉన్నారని అందులోనూ కొంతమంది మాత్రమే తన క్లైంట్‌పై ఫిర్యాదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కేసులో జోయెల్ దోషిగా తేలితే అతనికి 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు అశ్లీల సీడీలు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో గతంలోనూ జోయెల్ అరెస్టయ్యాడు. ఇందుకు సంబంధించిన కేసు సైతం ప్రస్తుతం విచారణలో ఉంది. 

click me!