ఆఫ్ఘనిస్తాన్: అబలలపై మళ్లీ ఆంక్షలు.. టీవీ, రేడియోల్లో మ్యూజిక్, మహిళల వాయిస్‌పై తాలిబన్ల నిషేధం

By Siva KodatiFirst Published Aug 29, 2021, 4:34 PM IST
Highlights

టీవీ, రేడియోల్లో మ్యూజిక్, మహిళల వాయిస్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. కాందహార్‌లో వున్న టీవీ, రేడియో ఛానెళ్లకు ఈ రకమైన ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను  ఆక్రమించారో అప్పుడే చాలా చానెల్స్ మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. 

ఆఫ్ఘన్లు భయపడుతున్నదంతా జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో షరియా చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు తాలిబన్లు. టీవీ, రేడియోల్లో మ్యూజిక్, మహిళల వాయిస్‌పై నిషేధం విధించారు. కాందహార్‌లో వున్న టీవీ, రేడియో ఛానెళ్లకు ఈ రకమైన ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను  ఆక్రమించారో అప్పుడే చాలా చానెల్స్ మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. కాగా, ఇప్పటికే దేశంలో కో ఎడ్యుకేషన్ రద్దు చేశారు తాలిబన్లు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు ఈ మేరకు ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. 

ALso Read:ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్ల వెనుక పాక్.. ఐసిస్ ఉగ్రవాదులకు వెన్నుదన్ను

అందరికీ క్షమాభిక్ష పెట్టామని ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని.. అలాగే మహిళలు సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబన్లు తొలి రెండు రోజులు శాంతి మంత్రాలు జపించారు. అయితే రోజులు గడిచే కొద్ది తమలోని పాత మతాచారాలను బయటకు తీస్తున్నారు తాలిబన్లు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తాజాగా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. 

click me!