స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా అండర్సన్.. పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా.. !!

By AN TeluguFirst Published Nov 25, 2021, 2:54 PM IST
Highlights

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురి కాగా, ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్ కు అనుకూలంగా  154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో అండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది.

డెన్మార్క్ : స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన Magdalena Andersson ఆ పదవిని చేపట్టిన కాసేపటికే Resignation చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఆమోదం లభించకపోవడంతోపాటు, ఆమె నేతృత్వం వహిస్తున్న కూటమి నుంచి గ్రీన్ పార్టీ వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు ఆమె రెండు పార్టీలతో కలిసి Minority Governmentని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురి కాగా, ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్ కు అనుకూలంగా  154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో అండర్సన్ నేతృత్వంలోని Social Democratic Party కఠిన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ప్రధాన మంత్రి పదవికి బుధవారం రాజీనామా సమర్పించారు. ఆ పదవిలో ఆమె సుమారు 7 గంటలపాటు మాత్రమే ఉన్నారు. ఆండర్సన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇది గౌరవానికి సంబధించిన విషయమని చెప్పారు. ప్రభుత్వ చట్టబద్ధతను, నియమబద్ధతను ప్రశ్నించే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడపటం తనకు ఇష్టం లేదన్నారు. 

కాగా, Sweden తొలి మహిళా ప్రధాన మంత్రిగా మంత్రి మగ్దలీనా అండర్సన్ ను నియమించేందుకు ఆ దేశ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది ఆమె ఇటీవలే సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులను వదులుకున్న Stefan Lofven స్థానంలో ఆమెను ఎంపిక చేశారు. మగ్దలీనా first woman prime ministerగా ఎంపిక కావడం  స్వీడన్ చరిత్రలో ఓ మైలురాయి వంటిది.

సైబర్ హ్యాకర్ల్ బారిన పడ్డ ‘గో డాడీ’.. 12 లక్షల మంది యూజర్ల డేటా ప్రమాదంలో..

స్త్రీ, పురుష సమానత్వం విషయంలో ప్రగతి పథంలో ఉన్న యూరోప్ దేశాలలో  స్వీడన్ ఒకటి  అని చెబుతారు.  అటువంటి దేశానికి ప్రధానిగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. స్టెఫాన్ లోఫ్ వెన్  ప్రభుత్వం  తనను తాను ‘Feminist’ గా చెప్పుకునేది.

స్వీడన్ పార్లమెంట్ లో 349 మంది సభ్యులు ఉన్నారు. ప్రధానమంత్రి పదవికి జరిగిన ఓటింగ్ లో మగ్దలీనా అండర్సన్ కు  అనుకూలంగా 117 ఓట్లు లభించాయి.  ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు. 57 మంది ఓటింగ్లో పాల్గొనలేదు.  ఒకరు  గైర్హాజరయ్యారు.  అయితే,  రాజ్యాంగం ప్రకారం కనీసం 175 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉంటేనే ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగవలసి ఉంటుంది.

ప్రస్తుతం మగ్దలీనాకు వ్యతిరేకంగా 174 మంది మాత్రమే ఓటు వేసినందు వల్ల ఆమెను ప్రధానమంత్రి పదవిలో నియమించేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.  సోషల్ డెమోక్రటిక్ పార్టీ, గ్రీన్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మగ్దలీనా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.  లెఫ్ట్ పార్టీ,  సెంటర్ పార్టీల మద్దతును కూడా  ఆమె కోరే అవకాశం కనిపించింది. అయితే అనూహ్యంగా ఆమె పదవి చేపట్టిన ఏడు గంటల్లోనే రాజీనామా చేశారు. 

click me!