Imran Khan: 24 గంటల నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లలేదు.. స్లో పాయిజన్ ఎక్కించి చంపేస్తారేమో: కోర్టులో ఇమ్రాన్ ఖాన్

By Mahesh KFirst Published May 10, 2023, 4:22 PM IST
Highlights

ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గత 24 గంటల నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లలేదని అన్నారు. తన డాక్టర్‌ను పిలిపించాలని కోరారు. తనను వారు చంపేస్తారేమోనని భయపడ్డారు. చప్రాసీ లెక్క తననూ అంతమొందిస్తారని ఆరోపించారు.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ పార్టీ మద్దతుదారులు తీవ్రరూపంలో ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం నాడు పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు ఆయనను ఇస్లామాబాద్ హైకోర్టు నుంచే అరెస్టు చేసుకుని తీసుకెళ్లారు. అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి జైలులో వేశారు. దీంతో ఆందోళనలు పెల్లుబికాయి. అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్టు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆ తర్వాత వెల్లడించింది.

ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు సరైనదేనని ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఆ తీర్పు అనేక అసంబద్ధ విషయాలతో నిండి ఉన్నదని వాదించారు. 

ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గత 24 గంటల నుంచి వాష్ రూమ్‌కు వెళ్లలేదని అన్నారు. తన డాక్టర్‌ను పిలిపించాలని కోరారు. 

Also Read: పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే బీజేపీ నేతపై దాడి చేసిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో ఇదే

‘మక్సూద్ చప్రాసీ తరహాలోనే నన్నూ చంపేస్తారేమో అని భయమవుతున్నది’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘వాళ్లు ఈ ఇంజిక్షన్లు ఎక్కిస్తారు. అనంతరం, ఆ వ్యక్తి మెల్లిగా చనిపోతాడు’ అని చెప్పారు. 

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆయన కుటుంబంపై ఉన్న మనీ లాండరింగ్ కేసులో మక్సూద్ చప్రాసీ ప్రధాన సాక్షి. చప్రాసీ గుండె పోటుతో మరణించాడు. డ్రగ్స్ ఎక్కించి షరీఫ్ కుటుంబమే చప్రాసీని చంపేసిందని, అతను కార్డియక్ అరెస్టుతో మరణించినట్టు ఆ డ్రగ్స్ చేస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

click me!