బ్రిటన్‌లో కొత్త వ్యాధి.. చిన్నారులపై తీవ్ర ప్రభావం, లక్షణాలివే

By Siva KodatiFirst Published Dec 13, 2022, 3:55 PM IST
Highlights

బ్రిటన్‌లో స్ట్రెప్ ఎ అనే కొత్త రకం వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అటు అమెరికాలోనూ స్ట్రెప్ ఎ జాడలు వెలుగుచూస్తున్నాయి. 

కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు ప్రపంచం వణికిపోయిన సంగతి తెలిసిందే. దీని ధాటికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆర్ధిక వ్యవస్థలు కోలుకుంటుండగా.. మాస్క్‌లు లేకుండా జనం బయటకు రావడం మొదలైంది. ఆ తర్వాత పలు రకాల వైరస్‌లు వెలుగులోకి వచ్చాయి కూడా. తాజాగా బ్రిటన్‌లో ఓ కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది పిల్లలపై విపరీతంగా ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాలోనూ దీని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు దేశాల్లో 9 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయా దేశాల హెల్త్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. 

అసలేంటీ స్ట్రెప్ ఎ ఇన్ఫెక్షన్..?

ఇది బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. దీని కారణంగా జ్వరం, గొంతు నొప్పి, చర్మంపై దద్దుర్లు, టాన్సిల్స్, జలుబు, విపరీతంగా చెమట పట్టడం, అలసట, చిరాకు, డీహైడ్రేషన్, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాల‌తో రోగులు బాధపడతారు. వ్యాధి సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతర వ్యక్తులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారినపడతారు. చిన్నారులు టాన్సిల్స్ దగ్గర నొప్పి అంటున్నా.. ఆ ప్రాంతంలో వాపు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. 

ఈ వ్యాధికి ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు.. కాకపోతే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోగల యాంటీ బయాటిక్స్ వున్నాయి. తీవ్రతను బట్టి, వైద్యుల సూచన మేరకు వాటిని ఉపయోగిస్తే సరిపోతుంది. 
 

click me!