మెల్‌బోర్న్‌లో ఉన్మాది వీరంగం.. కనిపించిన వారిని అడ్డంగా నరుకుతూ...

sivanagaprasad kodati |  
Published : Nov 09, 2018, 12:38 PM IST
మెల్‌బోర్న్‌లో ఉన్మాది వీరంగం.. కనిపించిన వారిని అడ్డంగా నరుకుతూ...

సారాంశం

ఆస్ట్రేలియాలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. మెల్‌బోర్న్‌లో అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తి తీసుకుని కనిపించిన వారిపై కత్తితో దాడి చేశాడు. 

ఆస్ట్రేలియాలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. మెల్‌బోర్న్‌లో అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తి తీసుకుని కనిపించిన వారిపై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఒక కారుకి నిప్పుపెట్టిన దుండగుడు పారిపోతుండగా... పోలీసులు కాల్చి చంపారు. అతని దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరికి మెడకు, రెండవ వారికి తలపై గాయం కాగా.. మూడో వ్యక్తికి పొట్టపై గాయం అయినట్లుగా సమాచారం.. తాజా ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేసి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి