
కొలంబో: అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని వెనుకబడిన దేశాలను డంపింగ్ యార్డ్‌గా వాడుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వేస్టేజీ(Wastage) సహా బయో వేస్టేజీ, ఇతర వ్యర్థాలనూ షిప్‌మెంట్‌లో పేద దేశాలు, వెనుకబడిన దేశాలకు పంపి చేతులు దులుపుకుంటున్నాయి. ఆ పేద దేశాలు ధనిక దేశాలకు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఈ తీరును ఏ చట్టమూ సమర్థించడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంక(Sri Lanka) వేల టన్నుల కొద్దీ వేస్టేజీని వందల కంటైనర్ల(Container)లో తిరిగి బ్రిటన్(Britain) దేశానికి షిప్పుల్లో పంపింది.
యూజ్‌డ్ కార్పెట్స్, మ్యాట్రెస్, రగ్స్ లిస్టింగ్‌లో 2017 నుంచి 2019లలో ఈ వేస్టేజీ(Garbage) బ్రిటన్ నుంచి శ్రీలంకకు వచ్చింది. కానీ, వాస్తవంలో ఆ వాడిన దుప్పట్లు, కార్పెట్లతోపాటు బయో వేస్ట్ కూడా శ్రీలంకకు వచ్చి పడింది. ఆ బయో వేస్టులో మార్చురీలలో వ్యర్థాలుగా మిగిలే బాడీ పార్టులు కూడా ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ కంటైనర్‌లు చిల్లింగ్‌లో లేవని, కాబట్టి, వాటి నుంచి భయానకంగా దుర్వాసన వస్తున్నదని వివరించారు.
అయితే, ఇలాంటి ప్రమాదకర వ్యర్థాలను కార్గో రూపంలో మళ్లీ శ్రీలంకకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ, తాము వీటిపై జాగరూకతగా ఉన్నామని కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియా వెల్లడించారు. ఇలా వ్యర్థాలు దేశానికి దిగుమతి కాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపారు. 2020 సెప్టెంబర్‌లో మెడికల్ వేస్టుతో కూడిన తొలి 21 కంటైనర్లను శ్రీలంక బ్రిటన్‌కు పంపింది. శ్రీలంకకు చెందిన ఓ స్థానిక కంపెనీ వీటిలోని స్ప్రింగ్‌లను రికవరీ చేసుకుంటామని, అలాగే, పత్తిని కూడా రికవరీ చేసుకుంటామని, వాటిని తిరిగి విదేశాల్లోని తయారీదారులకు పంపిస్తామని పేర్కొంది. కానీ, ఆ వ్యర్థాల నుంచి తీసిన వాటిని తిరిగి పంపే రీసోర్స్‌కు సంబంధించి తగిన ఆధారాలు లేవని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఈ వ్యర్థాలను తిరిగి ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికే పంపాలని ఓ పర్యావరణ కార్యకర్త శ్రీలంకలోని ఓ కోర్టులో 2020లో పిటిషన్ వేశారు. ఆ వ్యర్థాలను మోసుకువచ్చిన కంటైనర్లు అన్నీ ప్రమాదకర వేస్టేజీ షిప్‌మెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే శ్రీలంకలోకి వచ్చినట్టు కస్టమ్స్ అధికారులు కోర్టులో పేర్కొన్నారు. పిటిషనర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
2019లో శ్రీలంకలో మొదలైన దర్యాప్తులో ఆ వేస్టేజీని దిగుమతి చేసుకున్న ఇంపోర్టర్ సుమారు 180 టన్నుల వ్యర్థాలను ఇండియా, దుబాయ్‌లకు 2017, 2018లలో పంపినట్టు తేలింది. కాగా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలూ వందలాది కంటైనర్లును తిరిగి వచ్చిన దేశాలకు పంపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన చెత్త పన్ను చెల్లించని వారి కుటుంబంలో పింఛనుదార్లు ఎవరైనా ఉంటే.. వారికి ఇచ్చే పెన్షన్ నుంచి ఆ సొమ్ముని కట్ చేయాలని కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు ఆదేశించడం గతంలో చర్చనీయాంశం అయింది. ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని బోరంపాడులో చోటుచేసుకుంది. ఇంటి పన్నులు చెల్లించలేదనే కారణంతో వృద్దులకు ఇచ్చే పింఛన్‌లో రూ. 200 తగ్గించి ఇచ్చారు. దీంతో అవ్వతాతలు షాక్ తింటున్నారు. సంక్షేమ పథకాలు ఏమొచ్చినా.. వాలంటీర్లు ఇంటి పన్ను, చెత్త పన్ను, ఓటీఎస్ వంటి వాటికి వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.