10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

By narsimha lode  |  First Published Apr 21, 2019, 12:53 PM IST

ఇంటలిజెన్స్ హెచ్చరికలను శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదు.  10 రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారి ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో వంద మందికిపైగా మృత్యువాత పడ్డారు.


కొలంబో: ఇంటలిజెన్స్ హెచ్చరికలను శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదు.  10 రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారి ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో వంద మందికిపైగా మృత్యువాత పడ్డారు.

శ్రీలంక పోలీసు ఉన్నతాధికారి ఈ నెల 11వ తేదీన దేశంలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని  హెచ్చరించాడు. పోలీసు చీఫ్  పుజుత్ జయసుంద్ర ఈ హెచ్చరిక జారీ చేశారు. ఎన్‌టీజే ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Latest Videos

undefined

 దేశంలోని ప్రసిద్ది చెందిన చర్చిలను లక్ష్యంగా చేసుకొని  బాంబు దాడులు చేసే అవకాశం ఉందని  హెచ్చరించాడు.ముస్లిం గ్రూపులో రాడికల్ ముస్లిం గ్రూపుగా ఎన్‌టీజే గుర్తింపు పొంది. గత ఏడాది  ఈ గ్రూపు గురించి శ్రీలంక ప్రభుత్వం గుర్తించింది.

ఈ  ఇంటలిజెన్స్ హెచ్చరికలను శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఇదే హెచ్చరికలను పట్టించుకొని జాగ్రత్తలు తీసుకొంటే ఈ దారుణం చోటు చేసుకొనే అవకాశం ఉండేది కాదని  అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

click me!