Sri Lanka: అప్పుల ఊబిలో శ్రీలంక.. ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

Published : Mar 20, 2022, 06:23 AM IST
Sri Lanka: అప్పుల ఊబిలో శ్రీలంక.. ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

సారాంశం

Sri Lanka: శ్రీలంక ప‌రిస్థితి రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం, అధిక ధరల మంటల్లో మలమలమాడుతోంది. ఈ త‌రుణంలో కనీసం పేపర్‌, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేక ప్ర‌భుత్వం బడుల్లో పరీక్షలను రద్దు చేసింది. పేపర్‌ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు.    

Sri Lanka:  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంది. శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం, అధిక ధరల మంటల్లో మలమలమాడుతోంది. ఈ త‌రుణంలో కనీసం పేపర్‌, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేక బడుల్లో పరీక్షలను రద్దు చేసింది. పేపర్‌ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు.  దీంతో లక్షలాది మంది పాఠశాల విద్యార్థులకు శ్రీలంక ప్ర‌భుత్వం పరీక్షలను రద్దు చేసింది. 

 కాగితం, సిరా  దిగుమతులకు అవసరమైన డబ్బు లేకపోవడంతో ప్రింటింగ్ పేపర్ ను దిగుమతి చేసుకోలేక‌పోతున్నామ‌నీ, దీంతో లక్షలాది మంది పాఠశాల విద్యార్థుల పరీక్షలను శ్రీలంక రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు నివేదించారు. శ్రీలంక ఎడ్యుకేషన్ అధికారుల ప్రకారం.. 1948లో నుండి దేశంలో ఇంత‌టీ దారుణ‌మైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేద‌ని తెలిపారు.  పేపర్ కొరత కారణంగా సోమవారం నుండి జ‌ర‌గాల్సిన టర్మ్ పరీక్షలు నిరవధికంగా వాయిదా వేసిన‌ట్టు తెలిపారు. 

"అవసరమైన కాగితం, సిరాను దిగుమతి చేసుకోవడానికి దేశీయ ప్రింటర్లకు విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడింద‌ని పశ్చిమ ప్రావిన్స్ విద్యా విభాగం నివేదించింది. సంవత్సరం చివరిలో టర్మ్ పరీక్షలు నిర్వ‌హించాలా? లేదా? కేవ‌లం గ్రేడింగ్ విధానంతో విద్యార్థుల‌కు ప్ర‌మోట్ చేయాల‌నే దాని గురించి కూడా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిపింది. నిరంతర మూల్యాంకన ప్రక్రియలో భాగం.. దేశంలోని 4.5 మిలియన్ల విద్యార్థులలో మూడింట రెండు వంతుల విద్యార్థుల‌కు మాత్ర‌మే  పరీక్షలను నిర్వహించగలదని నివేదించింది. 

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్నికార‌ణ‌మేమిటి?

కరోనా కారణంగా.. శ్రీలంకలో టూరిజం చాలా దెబ్బతిన్న‌ది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలో శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్‌, సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బ్యాంకులకు ప్రభుత్వం 3.3 బిలియన్‌ డాలర్లు మేర చెల్లింపులకు బాకీ పడింది. అయితే ఫిబ్రవరి చివరి నాటికి శ్రీ‌లంక‌ విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇటీవలే భార‌త్ సైతం లంకకు 500 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. మ‌రో 100 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సహాయాన్ని అందించ‌నున్నది. 
  
ఈ సంవత్సరం ప్రారంభంలో 22 మిలియన్ల మంది నగదు కొరత కొట్టుమిట్లాడుతున్నారు. దీంతో  దక్షిణాసియా దేశాల‌ ప్రధాన రుణదాతలలో ఒకరైన చైనాను రుణ చెల్లింపులను సహాయం చేయమని కోరింది, అయితే బీజింగ్ నుండి ఇంకా అధికారిక ప్రతిస్పందన లేదు.  శ్రీలంక తన దిగజారుతున్న విదేశీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, బాహ్య నిల్వలను పెంచుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిలౌట్‌ను కోరుతుందని ప్రకటించింది. బెయిలౌట్‌పై చర్చించాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు శుక్రవారం IMF ధృవీకరించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే