
Japan PM Fumio Kishida: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. రష్యా దండయాత్ర అంతర్జాతీయ మూలాలను కదిలించే చాలా తీవ్రమైన సమస్య అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా స్పష్టం చేశారు. అంతర్జాతీయ మూలాలను, పరిస్థితులను దెబ్బ తీసే చర్య అని అభిప్రాయపడ్డారు. రష్యా తన దాడిని వెంటనే నిలిపివేయాలని, ఉక్రెయిన్‌ను ఆక్రమించడాన్ని ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోవని పేర్కొన్నారు. అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఫుమియో కిషిడా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల ముఖచిత్రాన్ని, బలవంతంగా మార్చేందుకు అనుమతించబోమన్నారు. ఉక్రెయిన్‌కు టోక్యో మద్దతు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరువురు నేతలు సమావేశమయ్యారు. భారత్, జపాన్ రెండూ ప్రస్తుత సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నాయి. కానీ, భారత్ మాత్రం తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సంయుక్త సమావేశానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ప్రత్యేక భారతీయ రీడౌట్ .. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని చెప్పారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి క్వాడ్ కూటమి ఏర్పాటు చేశాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య సంక్షోభానికి భారత్, జపాన్ శాంతియుత పరిష్కారం చూపుతాయన్నారు. క్వాడ్ కూటమిలోని తోటి సభ్యులలా కాకుండా - జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, భారత్.. మాస్కో చర్యలను ఖండిస్తూ హింసను ఆపాలని పిలుపునిచ్చింది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి క్వాడ్ కూటమి ఏర్పాటు చేశాయి.
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భారత్, జపాన్ భావిస్తున్నాయని ఫుమియో కిషిడా అన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్ మధ్య స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని చెప్పారు.
14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మిస్టర్ కిషిదా, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సదస్సులో భారత్‌లో వచ్చే ఐదేళ్లలో 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం అనంతరం చెప్పారు. ప్రత్యేక క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు వీలుగా ఆరు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇరు దేశాల సంబంధాలు పురోగతిని సాధించాయని చెప్పారు. భారత్‌లోని జపాన్ కంపెనీలకు సాధ్యమైనన్ని రకాలుగా మద్దతు అందించడానికి భారత్ కట్టుబడి వుందని అన్నారు. సైబర్ భద్రత, సామర్ధ్య నిర్మాణం, సమాచార మార్పిడి, సహకారం రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయని అన్నారు. ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్‌పై ఒక బృందం-ఒక ప్రాజెక్టుగా ఇరుదేశాలు పనిచేస్తున్నాయని మోడీ తెలిపారు. జపాన్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.