శ్రీలంక పేలుళ్లు: 39 దేశాలకు వీసా కట్

Siva Kodati |  
Published : Apr 26, 2019, 12:15 PM IST
శ్రీలంక పేలుళ్లు: 39 దేశాలకు వీసా కట్

సారాంశం

వరుస బాంబు పేలుళ్లలో 350 మంది మరణించడంతో శ్రీలంక నష్ట నివారణా చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల నేపథ్యంలో సుమారు 39 దేశాలకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ పర్యటక మంత్రిత్వశాఖ తెలిపింది

వరుస బాంబు పేలుళ్లలో 350 మంది మరణించడంతో శ్రీలంక నష్ట నివారణా చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల నేపథ్యంలో సుమారు 39 దేశాలకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ పర్యటక మంత్రిత్వశాఖ తెలిపింది.

శ్రీలంక ద్వీపం కావడంతో అక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా ఆ దేశానికి లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే సుమారు 7,40,600 మంది పర్యాటకులు ఆ దేశాన్ని సందర్శించారు.

గతేడాది సుమారు 4,50,000 మంది భారతీయులు శ్రీలంకలో పర్యటించారు. అయితే ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్ని పరిస్ధితుల నేపథ్యంలో 39 దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఈ దాడులకు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని విచారణలో వెల్లడైంది. దీంతో మరోసారి ఇక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి జాన్ అమరతుంగ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ