మహిళల బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు.. మెమోరీ కార్డు కిందపడటంతో వెలుగులోకి ఉదంతం.. పటిష్ట భద్రత ఉండే ఎంబసీలో ఘటన

Published : Feb 05, 2022, 01:57 PM ISTUpdated : Feb 05, 2022, 02:02 PM IST
మహిళల బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు.. మెమోరీ కార్డు కిందపడటంతో వెలుగులోకి ఉదంతం.. పటిష్ట భద్రత ఉండే ఎంబసీలో ఘటన

సారాంశం

మహిళల బాత్రూమ్‌లో స్పై కెమెరా బయటడింది. ఆ కెమెరా ఎస్డీ కార్డు బాత్రూమ్‌లో కిందపడి కనిపించడంతో అనమానంతో వెతకగా ఓ స్పై కెమెరా కనిపించింది. ఈ ఉదంతం ఎక్కడో బహిరంగ ప్రాంతాల్లో అని భ్రమిస్తే పొరపాటే. థాయ్‌లాండ్‌లోని ఆస్ట్రేలియా ఎంబస్సీలో వెలికి వచ్చింది. దీంతో ఎంబస్సీ స్టాఫ్‌గా పని చేస్తున్న ఓ స్థానికుడిపై ఆస్ట్రేలియా ఎంబస్సీ కేసు నమోదు చేసింది.  

న్యూఢిల్లీ: అది ఎంబస్సీ కార్యాలయం(Embassy Office). కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. దేశ, విదేశాల సమాచారాన్ని, దౌత్య పరమైన, వాణిజ్యపరమైన సమాచారంపై చర్చలు జరుగుతుంటాయి. ఉన్నత అధికారులు, ఉన్నత హోదా కలిగిన వ్యక్తులు, అధిపతులు వస్తుంటారు. అలాంటి చోట సెక్యూరిటీ(Security) పటిష్టంగా ఉంటుంది. కానీ, థాయ్‌లాండ్‌(Thailand)లోని ఆస్ట్రేలియా ఎంబస్సీ(Australia)లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నది. సెక్యూరిటీ కాదు.. కదా.. ఏకంగా ఆ కార్యాలయానికి చెందిన మహిళల బాత్రూమ్‌లోకి రహస్య కెమెరాలు వచ్చి చేరాయి. ఓ కెమెరా ఎస్‌డీ కార్డు బాత్రూమ్‌ (Women Bathroom)లో కనిపించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోని అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఆ బాత్రూమ్‌లో స్పూ కెమెరా (Spy Camera) ఎప్పుడు ఏర్పాటు చేసి పెట్టారనే విషయంపై క్లారిటీ లేదు. గతేడాదిలో బాత్రూమ్‌లో ఓ కెమెరా ఎస్‌డీ కార్డు కనిపించడంతో అనుమానాలు బలపడ్డాయి. బాత్రూమ్‌లో అనుమానపూరిత పరికరాల కోసం అంతా వెతికారు. ఓ స్పై కెమెరాను బాత్రూమ్‌లో ఏర్పాటు చేశారని అప్పుడు తెలిసింది. గతేడాది 6వ తేదీన ఆస్ట్రేలియా ఎంబసీ థాయ్‌లాండ్‌లో ఓ ఫిర్యాదు నమోదు చేసింది. ఓ వ్యక్తిపై ఆస్ట్రేలియా ఎంబసీ ఫిర్యాదు చేసిందని రాయల్ థాయ్ పోలీసు ఫారీన్ అఫైర్స్ డివిజన్ కమాండర్ ఖెమ్మరిన్ హాస్సిరి వివరించారు.

ఆస్ట్రేలియా ఎంబసీలో పని చేస్తున్న థాయ్‌లాండ్ స్థానికుడిపై ఫిర్యాదు నమోదైంది. ఆ వ్యక్తిని రాయల్ థాయ్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఆస్ట్రేలియా ఫారీన్ అఫైర్స్, ట్రేడ్ శాఖ తెలిపింది. గత నెలలోనే ఆ స్థానికుడిని అరెస్టు చేసినట్టు పేర్కొంది. అక్కడి సిబ్బంది సంక్షేమం, వారి గోప్యతను తాము ముఖ్యమైనదిగా భావిస్తామని ఆ శాఖ అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే ఈ కేసు దర్యాప్తులో తాము అన్ని విధాల పోలీసులకు సహకరిస్తున్నామని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఈ కేసులో విచారణ పురోగతిపై మాట్లాడటానికి ఆయన తిరస్కరించారు.

విదేశంలోని ఒక దేశ ఎంబస్సీ ఎంతో భద్రతంగా, కట్టుదిట్టమైన సెక్యూరిటీ అక్కడ ఉంటుంది. అలాంటి ఎంబస్సీ బాత్రూమ్‌లో స్పై కెమెరాలు విధించడం ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సెక్యూరిటీ పటిష్టంగా ఉండాల్సిన ఏరియాలో ఒక మహిళల బాత్రూమ్‌లో లేదా మరే చోటనైనా కెమెరా వంటి పరికరాలను అమర్చే అవకాశం ఉండటం ఆందోళనకరం అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రొఫెసర్ హ్యు వైట్ వెల్లడించారు. అసలు ఆ ఎంబస్సీలో సరిపడా సెక్యూరిటీ లేదనే స్పష్టం అవుతున్నదని తెలిపారు.

ఇదిలా ఉండగా, thailandకు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే Tattoo Artist‌ ఎనిమిది మంది భార్యలను పెళ్లాడాడు. వారు అందరితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంట్లో నాలుగు బెడ్ రూమ్ లో ఉండగా బెడ్ రూంకు ఇద్దరు చొప్పున ఎనిమిది మందితో కాపురం చేస్తున్నాడు. ఇటీవల తన Marital life గురించి ఓ టీవీ షోలో మాట్లాడుతూ తన భార్యలను పరిచయం చేస్తూ, వారిని ఇలా వివరించాడు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే