గుడ్ న్యూస్ : మాస్కులతో పనిలేదని ప్రకటించిన మరో దేశం..

By AN TeluguFirst Published May 26, 2021, 11:40 AM IST
Highlights

మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇక మీదట మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం లేదు. మాస్కులకు బైబై చెప్పేసి.. శానిటైజర్లను డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. 

మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇక మీదట మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం లేదు. మాస్కులకు బైబై చెప్పేసి.. శానిటైజర్లను డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. 

ఈ పరిస్థితి ఇప్పుడు దక్షిణ కొరియా లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు దక్షిణ కొరియా రెండు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది.

ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతోంది. దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 

జూన్ లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని 
జూన్‌లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్‌ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 

60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చొయొల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు నమోదయ్యాయి. 1,37,682.  నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు ఆ దేశంలో ప్రస్తుతం వేస్తున్నారు. 
 

click me!