అచ్చు రజనీకాంత్ రోబో సినిమానే: గందరగోళంతో మనిషిని చంపిన రోబో

By narsimha lode  |  First Published Nov 9, 2023, 5:11 PM IST

టెక్నాలజీని ఉపయోగించుకుని పనులు సులువుగా చేసుకుంటున్నారు మానవుడు. పరిశ్రమల్లో రోబోల వినియోగంతో కార్మికుల సంఖ్య కూడ చాలా తక్కువ అవసరం ఏర్పడుతుంది.  ఓ రోబో కారణంగా  దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 


సియోల్: దక్షిణ కొరియా దేశంలో  ఓ రోబో మనిషిని చంపింది. కూరగాయల పెట్టెగా భావించి మనిషిని  చంపింది. రోబోటిక్స్ కంపెనీ ఉద్యోగి దక్షిణ జియోంగ్ సాంగ్ ప్రావిన్స్ లో వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ కేంద్రంలో రోబోట్ సెన్సార్ కార్యకలపాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ నెల  8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది.సూపర్ స్టార్ రజనీకాంత్  తీసిన రోబో సినిమాలో చూపించిన విధంగానే  దక్షిణ కొరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  రోబో సెన్సార్ తనిఖీ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  కూరగాయల బాక్స్ గా మనిషిని భ్రమించింది రోబో. 

కూరగాయల బాక్స్ గా భావించి మనిషిని రోబో తీసుకెళ్లి  కన్వేయర్ బెల్ట్ పై వేసింది.  దీంతో  ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి  చాతీ,  ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.రోబో సెన్సార్  సరిచేసే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Latest Videos

   పెప్పర్ సార్టింగ్ ప్లాంట్ లో  టెస్ట్ రన్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.  ఈ నెల  6వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించాలని భావించాడు. అయితే రోబోటిక్ సెన్సార్ సమస్య కారణంగా ఈ నెల  8వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనతో  రోబోలతో పనులు చేయించేందుకు  కచ్చితమైన, సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డాంగ్ సోంగ్ ఎక్స్ పోర్ట్  అగ్రికల్చరల్ కాంప్లెక్స్ అధికారి కోరారు.

రోబోలు పరిమిత  సెన్సింగ్ కలిగి ఉంటాయి. తమ చుట్టూ  ఏం జరుగుతుందో  రోబోలకు పరిమితమైన అవగాహన కలిగి ఉంటుందని  కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో  రోబోటిక్స్ నిపుణుడు  క్రిస్టోఫర్ అట్కేసన్   అంతర్జాతీయ  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ ఏడాది మే మాసంలో  దక్షిణ కొరియాలోని ఆటోమొబైల్ విడిభాగాల యారీ కర్మాగారంలో  రోబో  చేతిలో చిక్కుకుని ఒకరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.1992 నుండి  2017 వరకు   అమెరికాలోని పారిశ్రామిక రోబోలతో  సుమారు  41 మంది మరణించారు.అమెరికన్ జర్నల్ మెడిసిన్ ఈ మేరకు ఓ అధ్యయనం తెలిపింది.83 శాతం  ప్రాణాంతక సంఘటనలకు స్టేషనరీ రోబోలు కారణమయ్యాయి. 2015లో జర్మనీలోని వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీలో  22 ఏళ్ల కార్మికుడు  రోబో చేతిలో  హత్యకు గురయ్యాడు.

tags
click me!