మరో కొత్తరకం కరోనా.. సెకండ్ వేవ్ కి అదే కారణం.. ఆరోగ్య‌శాఖ మంత్రి హెచ్చ‌రిక‌

By AN TeluguFirst Published Dec 19, 2020, 3:05 PM IST
Highlights

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ స్టార్టయింది. మరోవైపు కొత్తరకం కరోనా వైరస్ లు చుట్టుముడుతున్నాయి. తాజాగా దక్షణాఫ్రికాలో ఓ కొత్త రకం వైరస్ ఎటాక్ చేస్తోందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరిస్తున్నారు. 

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ స్టార్టయింది. మరోవైపు కొత్తరకం కరోనా వైరస్ లు చుట్టుముడుతున్నాయి. తాజాగా దక్షణాఫ్రికాలో ఓ కొత్త రకం వైరస్ ఎటాక్ చేస్తోందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరిస్తున్నారు. 

క‌రోనా వైర‌స్ గురించి తెలిసిన తరువాత అనేక వైర‌స్‌ల‌ను క‌నిపెట్టారు. దీంతోపాటు క‌రోనా వైర‌సే వివిధ రూపాల్లో దాడి చేస్తూ వ‌చ్చింది. దీన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ  ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌స్తున్నాయి ఆరోగ్య సంస్థ‌లు. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ ఎటాక్ చేస్తుంద‌ట‌.

దీన్ని స్వయంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే తెలిపారు. ఈ కొత్త వైర‌స్‌ను గుర్తించామని,  ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో వేవ్ ఈ కొత్త స్ట్రెయిన్ కారణమని వ్యాఖ్యానించారాయ‌న‌. అంతేకాదు, ఈ కొత్త‌ స్ట్రెయిన్‌పై అధ్యనం జ‌రుపుతున్నామ‌ని కూడా జ్వెలీ కిజే వెల్ల‌డించారు. కానీ, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని, అప్రమత్తంగా ఉంటే చాలని అన్నారు. 

ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా.. భౌతిక దూరం నిబంధనలు పాటించాలని విజ్ఞ‌ప్తి చేశారు. 501.వీ2 అనే కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించామ‌ని, కరోనా సెకండ్ వేవ్‌ వెనుకాల ఈ కొత్త రకం వైరస్ ఉందనేందుకు మాకు బలమైన ఆధారాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. 

కాక‌పోతే, మునుపటి వైరస్ కంటే ఇది అంత ప్రమాదకరమైన‌ది మాత్రం కాద‌న్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న వారికి ఈ వైర‌స్ మ‌ళ్లీ సోకే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్ప‌లేం అంటున్నారు. 

click me!