ఒకేసారి 1408 ఏనుగుల్ని ఎత్తగలిగే.. 820 అడుగుల భారీ క్రేన్...

By AN TeluguFirst Published Dec 18, 2020, 2:11 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు కనిపిస్తాయి. మబ్బుల్ని తాకుతున్నాయా అనిపించే బహుళ అంతస్తులు.. ఊగే వంతెనలు, భారీ నిర్మాణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతుంటే.. ఎన్నో.. ఇలాంటిదే ప్రస్తుతం బ్రిటన్ లో ఓ అద్బుతం జరిగింది. 

ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న ఓ అణురియాక్టర్ నిర్మాణంలో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రేన్‌గా గుర్తింపు పొందిన బిగ్ కార్ల్ ఏకంగా 575 టన్నుల బరువున్న ఓ సిలిండర్‌ను అలవోకగా ఎత్తి అవసరమైన స్థానంలో పెట్టింది. ఈ క్రేన్ ఇంతటి బరువు ఎత్తడం ఇదే తొలిసారి.

ఈ క్రేన్‌ అసలు పేరు ఎస్‌జీసీ-250. అయితే దీనికి బిగ్ కార్ల్ అనే పేరు కూడా స్థిరపడింది. కార్ల్ సారెన్స్ సారథ్యం వహిస్తున్న కంపెనీ ఈ క్రేన్‌ను నిర్మించడమే దీనికి కారణంగా. దీని పూర్తి ఎత్తు 875 అడుగులు. అంతేకాదు.. ఇది ఒకే పర్యాయంలో దాదాపు 5 వేల టన్నుల బరువున్న వస్తువులను పైకెత్తగలదు.

www.worldsteel.orgలోని సమాచారం ప్రకారం..20 విమానాలు, 63 రైళ్లు లేదా 1408 ఏనుగుల ఒకేసారి పైకెత్తగలిగిన సామర్థ్యం ఈ క్రెన్ సొంతం. ప్రస్తుతం 675 ఎత్తున్న ఈ క్రేన్ పోడవును పూర్తిగా పెంచితే 875 అడగుల వరకూ చేరుకోగలదు. బ్రిటన్‌లోని హింక్లీ పాయింట్‌లో ఇంజినీర్లు ఈ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. 

click me!