
Heavy Snowfall: అమెరికాలో మంచు తుఫాను విధ్వంసం సృష్టించింది. దాదాపు ఆరు అడుగుల వరకు దట్టమైన మంచు కురిసిందని అక్కడి మీడియా నవేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ న్యూయార్క్‌లో ఎమర్జెన్సీని ప్రకటించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. అమెరికాలో శీతాకాలపు ప్రభావం ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. శుక్రవారం నుంచి పలు చోట్ల మొదలైన మంచు ప్రభావం.. ఉత్తర న్యూయార్క్‌లో శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించింది. ఆయా ప్రాంతాల్లో మంచును తొలగిస్తున్న క్రమంలో మంచు తుఫాను కారణంగా పలువురు మరణించారు. మంచు తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లోని రోడ్లపై దాదాపు ఆరు అడుగుల వరకు దట్టమైన మంచు గడ్డకట్టింది. ముఖ్యంగా బఫెలో మెట్రో ప్రాంతం తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైందని అమెరికన్ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
మంచు తుఫాను కారణంగా బఫెలో మెట్రో ప్రాంతం ప్రభావితమైంది. నగరానికి దక్షిణంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున 5 అడుగులకు పైగా మంచు కురిసింది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. నగరానికి ఈశాన్యంగా 80 మైళ్ల దూరంలో ఉన్న ఫోర్ట్ డ్రమ్ ఆర్మీ బేస్ సమీపంలో ఆరు అడుగుల వరకు మంచు పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మంచు తొలగింపు సమయంలో పవులురు మృతి..
భారీ కురుస్తున్న మంచు కారణంగా చాలా మంది మరణించి ఉంటారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ బఫెలో ప్రాంతంలో మంచును తొలగిస్తున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారనీ, ఇండియానా నగరంలో స్నోప్లో డ్రైవర్ రోడ్లను క్లియర్ చేస్తున్నాడని.. అతను మరణించాడని ట్వీట్ చేశారు. బఫెలోలోని కొన్ని ప్రాంతాలు లేక్ ఎరీ సమీపంలో భారీ హిమపాతం కురిసింది.
పశ్చిమ న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ..
మంచు తుఫాను ప్రభావం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాలకు, ఏరీ సరస్సు, ఒంటారియో సరస్సు తూర్పు చివరతో సహా గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ ప్రాంతంలో అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు.
మంచు కారణంగా మ్యాచ్‌ను వేరే చోటుకు మార్పు..
ఆదివారం క్లీవ్‌ల్యాండ్ బ్రౌన్స్ మధ్య జరగాల్సిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ గేమ్ మంచు తుఫాను కారణంగా డెట్రాయిట్‌కు తరలించారు. నేషనల్ వెదర్ సర్వీస్ వాతావరణ శాస్త్రవేత్త జాక్ టేలర్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. "ఈ సాయంత్రం, వచ్చే వారం ప్రారంభంలో పశ్చిమ న్యూయార్క్‌లో మరో రౌండ్ మంచు తుఫానులు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము. ఎరీ సరస్సు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు అడుగుల వరకు మంచు కురుస్తున్నది" ఆయన చెప్పారు.