కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం

Published : Jul 09, 2021, 10:16 AM IST
కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం

సారాంశం

స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్‌ జాయింట్‌ రెస్క్యూ కో ఆర్టినేషన్‌ సెంటర్‌ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.

చిన్న సైజు విమానం కూలి.. తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన స్వీడన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ తోపాటు.. మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్‌ జాయింట్‌ రెస్క్యూ కో ఆర్టినేషన్‌ సెంటర్‌ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. 

కాగా, ఘటనపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్‌ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది.   
 

PREV
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం