కాల్పుల కలకలం : గర్భిణీ సహా ఆరుగురు మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు..

Published : Jan 25, 2021, 10:50 AM IST
కాల్పుల కలకలం : గర్భిణీ సహా ఆరుగురు మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు..

సారాంశం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో గర్భిణీ సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇండియానా పోలీస్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ముఖ్యంగా పుట్టబోయే బిడ్డతో సహా  గర్భిణీ స్త్రీ  చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ కాల్పులను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. దీనిపై  స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. 

అటు గత దశాబ్దకాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఈ కాల్పులు ఎందుకు జరిగాయో, ఎవరు చేశారో మాత్రం ఇంకా తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?