టీకా కోసం తొందరపడ్డాడు.. పదవిని కోల్పోయాడు

By Siva KodatiFirst Published Jan 24, 2021, 6:36 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో నాకు ముందంటే, కాదు నాకు ముందు అంటూ ఎగబడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో నాకు ముందంటే, కాదు నాకు ముందు అంటూ ఎగబడుతున్నారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యత అని ప్రపంచం మొత్తం చెబుతున్నా కొందరు మాత్రం ఆతృత పడుతున్నారు. తాజాగా ఓ సైనిక జనరల్ అత్యాశకు పోయి టీకా వేయించుకుని చివరికి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

స్పెయిన్‌కు చెందిన మిగేల్ యాంజెల్ విల్లోరియా! శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అంతకుమనుపు.. స్పెయిన్ పత్రికల్లో మిగెల్‌పై వస్తున్న ఆరోపణలను గురించి రక్షణ మంత్రి ఆయన్ను వివరణ కోరినట్టుగా తెలిసింది. 

కాగా..మిగేల్ రాజీనామా గురించి రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. సదరు జనరల్ ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. అత్యున్నత సైనికాధికారిగా తనకున్న విశిష్ట అధికారాలను ఆయన ఎన్నడూ దుర్వినియోగ పరచలేదని రక్షణ శాఖ పేర్కొంది.

కానీ ఈ చర్యలు ప్రజల దృష్టిలో సైన్యం ప్రతిష్టను దిగజార్చినట్టు పేర్కొంది. మరోవైపు యాంజెల్‌ వైఖరిపై స్పెయిన్‌లో ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ప్రాధాన్య క్రమం ప్రకారం ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయాల్సి ఉంది. దీనిని మిగెల్ ఉల్లంఘించారంటూ ప్రజలు మండిపడుతున్నారు.

ఇక్కడ క్యూలో 87 ఏళ్ల ఆల్జైమర్స్ వ్యాధిగ్రస్థుడు , ఓ మాజీ నర్సు, మరో క్లర్క్ కూడా ఉన్నారు. మీరు మాకంటే ఏ రకంగా ఎక్కువ అంటూ ఓ నెటిజన్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

click me!