అమెరికా మైనేలో కాల్పులు : 18మందిని చంపిన అనుమానితుడు... తుపాకీతో కాల్చుకుని మృతి...

By SumaBala Bukka  |  First Published Oct 28, 2023, 9:20 AM IST

యుఎస్ రాష్ట్రంలోని మైనేలో సామూహిక కాల్పులు జరిపిన నిందితుడు రెండు రోజుల తరువాత విగతజీవిగా కనిపించాడు.


మైనే : యుఎస్ రాష్ట్రంలోని మైనేలో సామూహిక కాల్పులు జరిపిన అనుమానితుడి కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, రెండు రోజుల తరువాత విగతజీవిగా దొరికాడు. అతను తనను తానే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లుగా యుఎస్ మీడియా శుక్రవారం తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియలేదు. అయితే, మైనేలోని అధికారులు రాత్రి 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. 

రాబర్ట్ కార్డ్ (40) అనే నిందితుడు రెండు రోజుల క్రితం మైనేలో విధ్వంసం సృష్టించాడు. రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 18 మందిని పొట్టనపెట్టుకున్నాడు. దీంతో అనుమానితుడి కోసం పోలీసులు భారీ గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో లెవిస్టన్ నుండి ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న అడవులలో అతని మృతదేహం దొరికింది. 

Latest Videos

undefined

అమెరికా మైనేలో కాల్పుల కలకలం, 22 మంది మృతి...

అతడిని ఇటీవలే ఉద్యోగం నుంచి తొలగించిన రీసైక్లింగ్ కేంద్రం సమీపంలో కార్డ్ మృతదేహం కనుగొనబడిందని ఈ వార్తా కథనం తెలిపింది. స్వయంగా తానే తుపాకీతో కాల్చుకోవడంవల్లే కార్డ్ చనిపోయినట్లు తేలింది. ఈ ఏడాదిలో దేశంలోనే అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన బుధవారం రాత్రి నమోదైంది. మృతులతోపాటు మరో 13 మంది రక్తపాతంలో గాయపడ్డారు.

70 ఏళ్ల వయస్సులో ఉన్న భార్యాభర్తలు, అతని తండ్రితో పాటు,14 ఏళ్ల బాలుడి బాధితుల్లో ఉన్నారని అధికారులు శుక్రవారం గుర్తించారు. అంతకుముందు శుక్రవారం, అధికారులు కార్డ్ ను పట్టుకోవడానికి 530 కంటే విధాలుగా లీడ్స్‌ను వెంబడిస్తున్నట్లు తెలిపారు. కార్డ్ ఆర్మీ రిజర్విస్ట్, కానీ ఏ పోరాట జోన్‌లోనూ కనిపించలేదు. అతడికి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడంతో అతన్ని ఇటీవల మానసిక చికిత్స కోసం పంపినట్లు యుఎస్ మీడియా నివేదించింది.
 

click me!