ఎనిమిది అడుగుల లోతు కాలువలో పడిన మహిళ.. నగ్నంగా..

Published : Mar 25, 2021, 12:05 PM IST
ఎనిమిది అడుగుల లోతు కాలువలో పడిన మహిళ.. నగ్నంగా..

సారాంశం

వారు అక్కడకు చేరుకొని.. సదరు మహిళలను బయటకు తీశారు. నిచ్చెన సహాయంతో ఆమెను బయటకు తీసి.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఓ మహిళ దాదాపు ఎనిమిది అడుగుల మురుగు కాలువలో పడిపోయింది. అందులో నుంచి రక్షించమంటూ అరపులు వినపడటంతో.. మరో మహిళ ఆమెను రక్షించడానికి ముందుకు వచ్చింది. కాగా.. కాలువలో ఉన్న మహిళ ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఓ మహిళ ఫ్లోరిడా లో తన వాహనంలో వెళుతుండగా.. ఎవరో అరుస్తున్నట్లు వినిపించింది. దీంతో... వెంటనే తన వాహనాన్ని పక్కన నిలిపి ఎవరు పిలుస్తున్నారో చూసింది. కాగా.. పక్కనే ఉన్న ఓ లోతైన మురుగు కాలువలో ఓ మహిళ ఉండటాన్ని గమనించింది.

అందులో ఉన్న మహిళ సహాయం కోసం గట్టిగా అరుస్తోంది. దీంతో ఈమె వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడకు చేరుకొని.. సదరు మహిళలను బయటకు తీశారు. నిచ్చెన సహాయంతో ఆమెను బయటకు తీసి.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సదరు మహిళ వయసు 43 సంవత్సరాలు ఉంటుందని వారు చెబుతున్నారు. సదరు మహిళ పేరు బయటకు చెప్పడానికి పోలీసులు అంగీకరించలేదు. అందులో పడే సమయంలో సదరు మహిళ డ్రగ్స్ తీసుకొని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొందరు ఆమెకు మతిస్థిమితంగా సరిగాలేదని భావిస్తున్నారు. 

కాగా.. దాదాపు మూడు వారాల క్రితం సదరు మహిళ బాయ్ ఫ్రెండ్.. ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆమె కనిపించకుండా పోయిన ప్రాంతం ఒకటైతే.. ఆమె మురుగు గుంతలో పడిన ప్రాంతం మరొకటి కావడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?