మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు జననం

Published : May 21, 2019, 04:46 PM IST
మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు జననం

సారాంశం

ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉన్నారు.

ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉన్నారు. ఓ మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించడం పోలాండ్ లో ఇదే తొలిసారి. సోమవారం క్రకౌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ ఆరుగురి పిల్లలకు జన్మనివ్వగా.. ఒక్కొక్కరు కిలో బరువు ఉన్నారు. 

దీంతో వైద్యులు వారిని ఇన్‌క్యూబెటర్స్‌లో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.  29 వారాల గర్భవతైన ఆమెకు సిజేరియన్‌ చేసినట్లు యూనివర్సిటీ వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. 

ఈ విషయం తెలుసుకున్న పొలాండ్‌ అధ్యక్షుడు అండ్రుజేజ్‌ దుడ ఆ దంపతులను ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘అబ్బురపరిచే వార్త.. పొలాండ్‌ దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం. ఆ దంపతులకు అభినందనలు. వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. పైగా సదరు మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే