బార్ లో కాల్పులు.. 11మంది మృతి

Published : May 20, 2019, 12:26 PM IST
బార్ లో కాల్పులు.. 11మంది మృతి

సారాంశం

బార్ లో కాల్పుల కలకలం రేగి... 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

బార్ లో కాల్పుల కలకలం రేగి... 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. బెలెమ్ నగరంలోని ఓ బార్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. 

కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన ఏడుగురిలో ఒకరిని బ్రెజిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారు? ఎవరూ జరిపారనే విషయాలపై స్పష్టత రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న