న్యూ ఇయర్ వేళ విషాదం.. ఉగాండాలోని షాపింగ్‌ మాల్‌లో తొక్కిసలాట.. 9 మంది మృతి..

Published : Jan 01, 2023, 03:25 PM IST
న్యూ ఇయర్ వేళ విషాదం.. ఉగాండాలోని షాపింగ్‌ మాల్‌లో తొక్కిసలాట.. 9 మంది మృతి..

సారాంశం

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ ఉగాండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతిచెందారు. 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ ఉగాండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వివరాలు.. ఉగాండాలోని కంపాలాలోని ఫ్రీడమ్ సిటీ మాల్‌ వద్దకు న్యూ ఇయర్ వేడుల కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలించారు. ఫ్రీడమ్ సిటీ మాల్‌ వెలుపల బాణాసంచా ప్రదర్శనను చూడటానికి ప్రజలు బయటకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో ఘటన స్థలంలో ఐదుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఘటన స్థలంలో మృతిచెందినవారితో కలిపి మొత్తం తొమ్మిది మంది మరణించినట్లు నిర్ధారించారని అక్కడి పోలీసులు తెలిపారు. కాట్వే టెరిటోరియల్ పోలీసులు నూతన సంవత్సర వేడుకలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన హడావిడి, నిర్లక్ష్యం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ నిర్వహణతో సంబంధం ఉన్నవారు.. అక్కడ హాజరైన వారిని బయటికి వెళ్లి బాణాసంచా ప్రదర్శనను చూడమని ప్రోత్సహించినప్పుడు అర్దరాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్