ఏలియెన్స్.. వింటున్నారా? మరోసారి సందేశాన్ని పంపించడానికి సిద్ధమవుతున్న సైంటిస్టులు

Published : Apr 19, 2022, 03:05 PM ISTUpdated : Apr 19, 2022, 03:09 PM IST
ఏలియెన్స్.. వింటున్నారా? మరోసారి సందేశాన్ని పంపించడానికి సిద్ధమవుతున్న సైంటిస్టులు

సారాంశం

మనిషి తొలిసారి 1974 నవంబర్‌లో చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఆ తర్వాత మనలాంటి జ్ఞాన జీవుల అన్వేషణ కోసం అంతరిక్షంలో అన్వేషణ ముమ్మరం అయింది. ఓ రేడియో మెస్సేజీని గతంలోనే పంపించారు. దాని నుంచి సమాధానం వస్తారని అనుకున్నా.. రాలేదు. తాజాగా, మరోసారి ఇలాంటి సందేశాన్నే పంపాలని శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు.

న్యూఢిల్లీ: ఈ విశాల విశ్వంలో జీవం ఉనికి ఉన్న గ్రహం ఒక్క భూమేనా? మరే ఇతర గ్రహాల్లోనైనా జీవం ఉన్నదా? సౌర కుటుంబం వెలుపల.. పాలపుంతలోని ఇతర గ్రహాల్లో.. జీవం ఉనికి ఉన్నదా? లేదా.. మొత్తం విశ్వంలో ఏదో ఓ గ్రహంపై జీవి మనుగడ ఉన్నదా? ఇలాంటి ప్రశ్నలతో అన్వేషణలు దశాబ్దాల క్రితమే మొదలైంది. కానీ, స్పష్టమైన సమాధానం నేటికీ రావలసే ఉన్నది. మనిషి తొలిసారి భూమి వదిలి చందమామపై అడుగుపెట్టినప్పటి నుంచి గ్రహాంతరవాసుల ఉనికిపై ఆసక్తి అనేక రెట్లు పెరిగింది.

1974 నవంబర్‌లో తొలిసారి మనిషి చంద్రుడిపై కాలు మోపాడు. అప్పటి నుంచే రోదసిలోకి మరింత చొచ్చుకెళ్లాలనే కోరిక బలపడింది. ఇతర సౌర కుటుంబాలు, జీవి ఉనికి ఉండే అవకాశాలు ఉన్న గ్రహాల అన్వేషణ ముమ్మరం అయింది. మానవుడు చంద్రుడిపై పాదం మోపిన తర్వాత శాస్త్రజ్ఞులు గ్రహాంతరవాసుల కోసం ఓ రేడియో సందేశాన్ని అంతరిక్షంలోకి పంపారు. పూర్టో రికోలోని ఎర్రసిబో టెలిస్కోప్ ద్వారా జీవి ప్రాథమిక రసాయనాలు, డీఎన్ఏ స్ట్రక్చర్, సౌర వ్యవస్థలో భూమి లొకేషన్, మనిషి ఆకారం వంటి వివరాలను ఆ సిగ్నల్స్‌లో పొందుపరిచి పంపించారు.

ఈ విశాల అంతరిక్షంలో ఆ సందేశం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నది. మళ్లీ సుమారు 50 సంవత్సరాల తర్వాత మరోసారి గ్రహాంతరవాసుల కోసం మెస్సేజీ పంపించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. మన పాలపుంత గెలాక్సీలోనే ఏవైనా గ్రహాంతరవాసులు ఉండి ఉంటే వాటితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో మళ్లీ రేడియో మెస్సేజీని పంపించాలని ఆలోచనలు చేస్తున్నారు.

ఈ సందేశంలో కమ్యూనికేషన్ కోసం అవసరమైన చిన్ని ప్రిన్సిపుల్స్, బేసిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్‌లు, ఫిజిక్స్ ఫార్ములాలు, డీఎన్ఏ కణాలతోపాటు మనిషి, భూగ్రహం వివరాలను సందేశంలో నిక్షిప్తంగా పంపాలని శాస్త్రజ్ఞుల బృందం యోచిస్తున్నది. ఒక వేళ ఈ సందేశం అందిన తర్వాత మనుషులతో కమ్యూనికేట్ కావాలనుకుంటే తిరిగి సందేశం పంపడానికి కావాల్సిన అడ్రస్‌ను కూడా ఈ సందేశంలో జోడించారు.

మన మిల్కివే గెలాక్సీలో ప్రాణం ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాలకు అంటే గ్రహ సముదాయాలు లక్ష్యంగా ఈ సందేశాన్ని చైనాలోని స్పెరికల్ రేడియో టెలిస్కోప్, ఉత్తర కాలిఫోర్నియాలోని ఎస్ఈటీఐ ఇన్‌స్టిట్యూట్స్ ఆలెన్ టెలిస్కోప్ ఆరె ద్వారా పంపించాలని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

మేధస్సు కలిగిన జీవి మనుగడ సాధించే అవకాశాలు ఉన్న గ్రహాల గురించి మిల్కీ వే గెలాక్సీలో వ్యోమగాములు కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. మన గెలాక్సీలో జీవి మనుగడకు అనుకూలంగా ఉన్న సుమారు 5000 ప్రపంచాలను నాసా ఇప్పటి వరకు గుర్తించింది. కానీ, ఈ ప్రపంచాలన్నింటినీ అధ్యయనం చేయడం సాధ్యం కాదని ఆస్ట్రానామార్లు పేర్కొన్నారు. కాబట్టి, ఈ రేడియో సందేశం ద్వారా ప్రయత్నాలు చేయాలని సంకల్పించినట్్టు తెలిపారు.

అయినప్పటికీ ఈ సందేశాన్ని వినే తెలివిగల జంతువులు లేదా జీవులు ఉండటం అరుదు అని వారు పేర్కొన్నారు. అయితే, ఒక వేళ ఈ మెస్సేజీ చూసినప్పటికీ వాటికి రెస్పాండ్ కావడం మరి అరుదు. ఈ బ్రాడ్ క్యాస్ట్ సిగ్నల్స్‌ను స్వీకరించిన తర్వాత వాటిని తిరిగి భూమిపైకి పంపిస్తాయని భావించడం కొద్దిగా మూర్ఖత్వంగానే కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. అయినప్పటికీ శాస్త్రజ్ఞులు మాత్రం ఆశావాద దృక్పథంతో ఈ మెస్సేజీని స్పేస్‌లోకి పంపించాలని యోచిస్తున్నారని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే