Malaysian minister: భార్యలను దారికి తెచ్చుకునేందుకు... అవసరమైతే వారిని సున్నితంగా దండించాలని మలేషియాకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఒకరకంగా గృహ హింసను ప్రేరేపించమేనని ఆ మహిళా మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్యాతయుతమైన మంత్రి ఇలాగేనా మాట్లాడేదని మలేషియా ప్రజలు ఆమెపై మండిపడుతున్నారు
Malaysian minister: భార్య భర్త మాట వినాలంటే .. దండించాలని..అలా చేస్తేనే భార్య క్రమశిక్షణతో ఉంటుందని.. భర్తలకు ఉచిత సలహాలు ఇచ్చారు ఓ మలేషియా మంత్రి. పైగా ఆ మంత్రి ఓ మహిళే కావటం మరో విశేషం. ఇప్పుడూ ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఒకరకంగా ఇది గృహ హింసను ప్రేరేపించడమేననీ. ఆ మహిళా మంత్రిపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఒక బాధ్యాతయుత మంత్రి స్థానంలో ఉండి.. ఇలాగేనా మాట్లాడేదని నెటిజన్లు మండిపడుతున్నారు
వివరాల్లోకెళ్తే.. మలేషియా మహిళా మంత్రి సితీ జైలా మహమ్మద్ యూసుఫ్(Siti Zailah Mohd Yusoff) 'మదర్ టిప్స్' పేరిట ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచింది. ఈ ఖాతా ద్వారా ఆమె నెటిజన్లకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తున్నారు. Siti Zailah Mohd Yusoff గత వారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యాభర్తల గురించి మాట్లాడుతూ కొన్ని సలహాలిచ్చారు. భార్యలను ఎలా మందలిస్తారు' అనే వీడియోను పంచుకున్నారు,
undefined
ఈ వీడియోలో.. భర్తలు మొదట్లో వారి క్రమశిక్షణ లేని, మొండి పట్టుదలగల భార్యలతో మాట్లాడాలని ఆమె సలహా ఇచ్చింది. భార్య భర్త మాటలను పాటించడంలో విఫలమైతే.. వారు వారితో మంచం పంచుకోకూడదని ఆమె పేర్కొంది. ఇంకా..భార్య గనక భర్త సలహాలను పాటించకపోతే..మూడు రాత్రులు ఆమెతో కలిసి పడుకోవద్దని..విడిగా పడుకోవాలని కూడా చెప్పారు. అప్పటికీ దారికి రాకపోతే కొడుతూ.. విరుచుకుపడాలని సలహాలు చెప్పారు. ఇలా చేస్తేనే.. భర్త అంటే ఏమిటో భార్యకు తెలిసొస్తుందన్నారు. అయినప్పటికీ..ఆమె మారకపోతే.. మీ మాట వినకపోతే.. మీరెంత కఠినంగా ఉండాలన్నారు. అవసరమైతే.. సున్నితంగా దండించాలని చెప్పారు.
అలాగే భార్యలకూ కొన్ని సలహాలిచ్చారు. భార్యలకు తమ భర్తల మనస్సులను గెలుచుకోవాలంటే.. భార్యలు ఏదైనా చెప్పాలని అనుకున్నారు.. ఏదైనా చేయాలని అనుకున్నా భర్తల అనుమతి తీసుకున్నాకే చేయాలని తెలిపారు. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని మినిస్టర్ పేర్కొన్నారు.
డిప్యూటీ మినిస్టర్ సిటి జైలా మహ్మద్ యూసోఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. పురుషులు తమ భార్యలను కొట్టమని ప్రోత్సహించడం ద్వారా గృహ హింసను మంత్రి పోత్సహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి పదవి నుంచి వైదొలగాలని పలు మహిళా హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడే కాదు గతంలోనూ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.