ఆంక్షలు ఉట్టి మాటలే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయి: రష్యా

Published : Feb 26, 2022, 09:00 PM IST
ఆంక్షలు ఉట్టి మాటలే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయి: రష్యా

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇప్పట్లో ఆగేలా లేవు. ఉక్రెయిన్ ఈ ఘర్షణలు మరింత ముందుకే తీసుకుపోయేలా వ్యవహరిస్తున్నదని రష్యా పేర్కొంది. కాగా, అమెరికా సహా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు మిథ్ అని పేర్కొన్నారు. వాటితో ఒరిగేదేమీ లేదని, రష్యా వైఖరిలోనూ ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది. పుతిన్ లక్ష్యాలు నెరవేరే వరకు మిలిటరీ ఆపరేషన్ జరుగుతుందని వివరించింది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేవు. రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం(War) చేయకపోయినా... మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తున్నది. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌(Kyiv)ను గుప్పిట్లోకి తీసుకోవడానికి పావులు కదిపింది. తాము ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనుకోవడం లేదని, కేవలం దొంబాస్ రీజియన్‌(Donbass Region)లోని రెండు స్వతంత్ర ప్రాంతాలు డీపీఆర్, ఎల్‌పీఆర్‌ల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని రష్యా తెలిపింది. కాగా, ఉక్రెయిన్ మాత్రం.. రష్యాను ఆపడానికి దౌత్య  మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము చర్చలకు సిద్ధమేనని, కానీ, ఈ ఘర్షణలను ఆగిపోయేలా ఉక్రెయిన్ నడుచుకోవడం లేదని పేర్కొంది.

అదే విధంగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించగానే అమెరికా, పశ్చిమ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తామని ప్రకటించాయి. అయితే, ఆ ఆంక్షలు ఉట్టి మాటలేనని రష్యా సింపుల్‌గా తీసిపారేసింది. రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన ఆ అద్భుతమైన ఆంక్షలు ఏం మార్పునూ తీసుకురాబోవని వివరించింది. దొంబాస్ రీజియన్‌లోని ఉక్రెనియన్లు కాపాడటానికి రష్యా చేపడుతున్న మిలిటరీ ఆపరేషన్‌ను నిలువరించలేవని స్పష్టం చేసింది. వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన లక్ష్యాలను చేరుకోకుండా ఆ ఆంక్షలు అడ్డుకట్ట వేయలేవని తెలిపింది. రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ ఈ వ్యాఖ్యలు శనివారం చేశారు. రష్య సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై, ఇతర ప్రాంతాలపై దాడులు ముమ్మరం చేసిన తరుణంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.

ఉక్రెయిన్‌పై రష్యా గురువారం సైనిక చర్య ప్రారంభించగానే అమెరికా, దాని మిత్ర పక్షాలు ఆంక్షలు ప్రకటించారు. రష్యాకు చెందిన నాలుగు పెద్ద బ్యాంకుల నిధులను బ్లాక్ చేశాయి. అలాగే, ఎగుమతలపై నియంత్రణలు, వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితులైన సముదాయాలపైనా ఆంక్షలు విధించాయి. 

ఈ అద్భుతమైన ఆంక్షలతో రష్యా వైఖరిలో ఏ మార్పూ రాదని మాజీ ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్ తెలిపారు. అమెరికా రక్షణ శాఖలోని అధికారులకూ ఈ విషయాలు తెలుసు అని, అంటే.. తమ మిలిటరీ ఆపరేషన్‌లో ఏ మార్పూ ఉండదని ఇది స్పష్టం చేస్తున్నదని వివరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెట్టిన లక్ష్యాలు సాధించే వరకు ఈ ఆపరేషన్ సాగుతుందని స్పష్టం చేశారు.

రష్యాకు చెందిన అధికారిక ప్రతినిధి వ్యాచెస్లావ్ వోలోడిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ .. రాజధాని కీవ్‌ను విడిచి రహస్య ప్రాంతానికి చేరుకున్నారని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఎల్వివ్‌లో వున్నారని వోలోడిన్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించాల్సి  వుంది. 

అమెరికా ఆ దేశ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీకి ఓ ఆఫర్ ఇచ్చింది. కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే