World War III: మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టే.. రష్యా అధికారిక మీడియా సంచలన ప్రకటన

Published : Apr 15, 2022, 11:07 PM ISTUpdated : Apr 15, 2022, 11:21 PM IST
World War III: మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టే.. రష్యా అధికారిక మీడియా సంచలన ప్రకటన

సారాంశం

World War III: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య భీకరయుద్ధం కొనసాగుతున్న నేప‌థ్యంలో రష్యా అధికారిక మీడియా సంచలన క‌థ‌నాల‌ను ప్రసారం చేస్తోంది. రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా మునిగిపోవ‌డంతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టేనని పేర్కొంటూ రష్యా టెలివిజన్‌ చానెళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి  

World War III: రష్యా- ఉక్రెయిన్‌ మధ్య భీకరయుద్ధం కొనసాగుతున్న నేప‌థ్యంలో రష్యా అధికారిక మీడియా సంచలన క‌థ‌నాల‌ను ప్రసారం చేసింది. ఉక్రెయిన్ దుకుదూ పెంచింద‌నీ, ఆ దేశ సైన్యం దాటికి ర‌ష్యా యుద్ద నౌక మాస్కోవా మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యా 1 త‌న‌ ప్రసారం లో పేర్కొంది. ఇప్పుడు ఈ వార్త క‌థ‌నానికి సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా దెబ్బతిన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని క్రెమ్లిన్ కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది.  అయితే ఉక్రెయిన్ మాత్రం.. తమ నెప్ట్యూన్ క్షిపణి ద్వారా నల్ల సముద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన నౌకను నాశనం చేసిన ఘనతగా పేర్కొంది. ఈ నేప‌థ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని రష్యా ప్రధాన అధికారిక మీడియా ‘రష్యా 1’ పేర్కొంది.  ఈ క్ర‌మంలో రష్యా ప్రభుత్వ ఛానెల్‌ ‘రష్యా 1’ ఛానెల్‌ ప్రజెంటర్‌ ఒల్గా స్కాబెవెయా ఓ డిబెట్‌లో.. అధికారంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రకటన చేశారు. ఈ ఘ‌ట‌న‌తో రష్యా ఆలోచన పక్కదారి పట్టిందని హెచ్చరించింది. 

ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఉదృతం కానున్న‌ట్టు హెచ్చరించింది. ఈ బాంబు దాడులు ఇలానే కొన‌సాగితే.. చర్చలు నిలిపివేసే.. అవకాశముంద‌ని, శాంతి చర్చలు నిలిపివేయడం కూడా ఉక్రెయిన్‌పై బాంబు వేయడంగానే వారు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో రష్యా మీడియా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “ఇప్పుడు మేము నాటోకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము, ఒకవేళ నాటో కాకపోయినా.. మేము దానిని గుర్తించాల్సిందే.. ముఖ్యమైన ప్రకటన.. ఇది మూడో ప్రపంచ యుద్ధం.. ఎప్పుడో మొదలైపోయింది’’ అంటూ న్యూస్ ప్రెజెంటర్ ఓల్గా స్కబెయేవా చిల్లింగ్  ఆవేశ పూర్తితంగా మాట్లాడింది. ఈ షోలో  అతిథి గా వ‌చ్చిన వ్య‌క్తి  మోస్క్వా యుద్ద నౌక‌ మునిగిపోవడాన్ని రష్యన్ గడ్డపై దాడితో పోల్చారు. క్రెమ్లిన్‌ చేసిన అగ్నిప్రమాద ఘటన ప్రకటనకు విరుద్ధంగా కామెంట్లు చేశాడు. అయితే.. ఇది ప్రత్యేక సైనికచర్య అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన.. సదరు ప్రజెంటర్‌కు గుర్తుచేశారు. కాగా ఈ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే