కుటుంబాలను కాపాడుకునేందుకు ఐరోపా బాటపడుతోన్న ఉక్రెయిన్ వాసులు.. ఇప్పటి వరకు 50 లక్షల మంది వలస

Siva Kodati |  
Published : Feb 26, 2022, 05:18 PM IST
కుటుంబాలను కాపాడుకునేందుకు ఐరోపా బాటపడుతోన్న ఉక్రెయిన్ వాసులు.. ఇప్పటి వరకు 50 లక్షల మంది వలస

సారాంశం

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ను వీడుతున్నారు ఆ దేశ ప్రజలు. ఐరోపా దేశాలకు ఉక్రెయిన్ పౌరుల వలస కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది ఐరోపాకు వలస వెళ్లారు. మహిళలు, చిన్నారులు ఐరోపాకు వలస వెళ్లిన వారిలో వున్నారు.

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ను వీడుతున్నారు ఆ దేశ ప్రజలు. ఐరోపా దేశాలకు ఉక్రెయిన్ పౌరుల వలస కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది ఐరోపాకు వలస వెళ్లారు. మహిళలు, చిన్నారులు ఐరోపాకు వలస వెళ్లిన వారిలో వున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై (ukraine ) రష్యా బలగాలు (russia army) విరుచుకుపడుతున్నాయి. జనావాసాలపై మిస్సైల్ దాడులు చేస్తున్నాయి. ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరోవైపు వైమానిక దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో విధ్వంసం సృష్టించింది రష్యా. అపార్ట్‌మెంట్లు , షాపింగ్ మాల్స్, మార్కెట్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సైనికులతో పాటు సామాన్య  ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా దాడుల్లో 198 పౌరులు మృతిచెందగా.. దాదాపు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటన ప్రకారం, రష్యా సేనలు తమ దేశంలోకి అన్ని వైపులా నుంచి ప్రవేశిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సంబంధించి చాలా జటిలమైన ప్రాంతం క్రిమియాతో కలిసే ప్రాంతమే. ఈ ప్రాంతం నుంచి రష్యా సేనలు దేశంలోకి ప్రవేశించే యత్నం చేశాయి. ఆ భారీ ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి జెనిచ్ కార్ బ్రిడ్జీని పూర్తిగా కూలదోయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఓ వేరే సెయిలర్ బెటాలియన్‌‌కు చెందిన ఇంజినీర్ షకున్ విటాలి వొలొడిమిరోవిచ్‌కు అప్పజెప్పారు. ఆ బ్రిడ్జీని ఆయన రిప్లేస్ చేయగలిగాడు. కానీ, అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయ్యే సమాయం దక్కలేదు. అక్కడ ఇంకొన్ని క్షణాల్లో బాంబు పేలిపోనుంది. ఆ పేలుడు నుంచి తాను బయట పడబోనని ఆ జవాను రియలైజ్ అయ్యాడు. దీంతో ఆయన అక్కడే ఉండిపోయాడు. 

ఈ పేలుడులో తమ జవాను షకున్ విటాలి వొలొడిమిరోవిచ్‌ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన చేసిన పనితో రష్యా బలగాల ప్రయాణం ఆలస్యం అయిందని, తద్వార తమ జవాన్లకు వ్యూహాత్మక సమయం చిక్కిందని ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమ ప్రాణాలు ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటామని ఆ ఆర్మీ ప్రకటన ముగిసింది.

కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు. ‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే