హెలికాఫ్టర్ కూలి..18మంది మృతి

First Published Aug 4, 2018, 3:58 PM IST
Highlights

హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే  వేరే హెలికాఫ్టర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.  ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయన్నారు.

హెలికాఫ్టర్ కూలి 18మంది మృత్యువాతపడిన సంఘటన సైబీరియాలో చోటుచేసుకుంది. ఎంఐ-8 హెలికాప్టర్‌ ఈరోజు ఉదయం ఆయిల్‌ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు. హెలికాప్టర్‌లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

 హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే  వేరే హెలికాఫ్టర్ తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.  ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయన్నారు.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ సైబీరియా ఉత్తరప్రాంతంలోని చమురు బావి వద్దకు వాంకోర్‌ అనే కంపెనీ సిబ్బందిని తీసుకెళ్తోందని తెలుస్తోంది. ఈ హెలికాప్టర్‌ను ఉటైర్‌ విమానయాన సంస్థ నడిపిస్తోంది. రష్యాలోని ఇగర్కా అనే నగరం నుంచి హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయ్యింది. విమానాశ్రయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగి కూలిపోయింది.

 సాంకేతిక సమస్యతో పాటు పైలట్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని, హెలికాప్టర్‌లో నిండుగా ఉన్న రెండు ఇంధన ట్యాంకులు పేలిపోయాయని రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి. సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

click me!