
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే, రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు దాడులను ఆపాలని రష్యాను కోరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తూ.. ఆయుధాలు అందజేస్తున్న అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
వివరాల్లోకెళ్తే.. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూ ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
ప్రపంచంలోని చాలా దేశాలు ఉక్రెయిన్ మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే, అమెరికాతో పాటు యూరప్ దేశాలు, నాటో కూటమి దేశాలు రష్యా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ మాట్లాడుతూ.. రష్యా బలగాలపై దాడి చేసేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను నిల్వ చేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని అన్నారు.
అలాంటి ఆయుధ వాహనాలపై రష్యా సైన్యం చట్టపరమైన దాడికి గురి అవుతున్నాయని పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధాలను తీసుకెళ్తున్న వాహనాలపై కూడా రష్యా సైన్యం దాడులు చేస్తుంది అని హెచ్చరించారు. అయితే, రష్యా హెచ్చరికను అమెరికా సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై స్పందనలు రాలేదని తెలుస్తోంది. అయితే, రష్యా ప్రత్యక్ష యుద్ధంతో కాకుండా.. పరోక్షంగా దెబ్బకొట్టే విధంగా అమెరికా, యూరప్ దేశాలు, నాటో కుటమి దేశాలు అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున రష్యాపై అమెరికా, నాటో కూటమి దేశాలు విధించాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిలిచిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది. ఇక చాలా కంపెనీలు అక్కడ తమ సేవలను నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ఉపాధి కి దూరమవుతున్న రష్యన్ల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నదని స్థానిక మీడియా పేర్కొంటున్నది. దీని కోసం రష్యాలోని ఆయా కంపెనీలకు చెందిన వాటిని స్వాధీనం చేసుకోవడానికి రష్యా కొత్త చట్టాలు తీసుకురావడానికి సిద్ధమవుతున్నదని తెలుస్తోంది.