రష్యాపై ఉక్రెయిన్ తరఫున అమెరికా సైన్యం యుద్దంలో పాల్గొనదు.. కానీ.. : బైడెన్ కీలక వ్యాఖ్యలు

Published : Mar 02, 2022, 01:59 PM IST
రష్యాపై ఉక్రెయిన్ తరఫున అమెరికా సైన్యం యుద్దంలో పాల్గొనదు.. కానీ.. : బైడెన్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. ఉక్రెయిన్‌కు తన మద్దుతను బలపరిచారు. అమెరికా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడారు. రష్యా భీకర దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు మనో ధైర్యంతో పోరాడుతున్నారని ప్రశంసించారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. ఉక్రెయిన్‌కు తన మద్దుతను బలపరిచారు. అమెరికా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడారు. రష్యా భీకర దాడులు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు మనో ధైర్యంతో పోరాడుతున్నారని ప్రశంసించారు. అయితే రష్యాపై ఉక్రెయిన్ పోరాటంలో అమెరికా సేనల ప్రమేయం ఉండదని.. అయితే నాటో సభ్యదేశాల భూభాగాల జోలికి వస్తే మిత్రదేశాలతో కలిసి వాటిని కాపాడుకుంటామని చెప్పారు. పుతిన్ యుద్దభూమిలో లాభాలు సాధించవచ్చని.. కానీ దీర్ఘకాలంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

‘యుఎస్, మా మిత్రదేశాలు.. పూర్తి సామూహిక శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాయి. ఉక్రెయిన్ ప్రజులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు. పుతిన్ యుద్దభూమిలో ప్రస్తుతానికి విజయం సాధించవచ్చేమో.. కానీ దీర్ఘకాలంలో అతను మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడటం లేదు. కానీ మా నాటో మిత్రదేశాలను రక్షించడానికి.. పుతిన్ పశ్చిమ దేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి సిద్దంగా ఉంటాయి. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి మేము అమెరికన్ గ్రౌండ్ ఫోర్స్‌లు, ఎయిర్ స్క్వాడ్రన్‌లు, నౌకలను సమీకరించాం’ అని బైడెన్ తెలిపారు. 

అమెరికా ప్రజలు, తాము ఉక్రెయిన్‌‌ ప్రజలతో ఉంటామని బైడెన్ అన్నారు. నియంతలు వారి దూకుడుకు మూల్యం చెల్లించనప్పుడు.. వారు యుద్దం, గందరగోళానికి కారణమవుతారు. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచానికి ముప్పు పెరుగుతుంది. అందుకే రెండో ప్రపంచ యుద్దం తర్వాత యూరప్‌లో శాంతి, స్థిరత్వం కోసం నాటో కూటమి సృష్టించబడింది. ఇందులో అమెరికా సభ్య దేశం. అమెరికా దౌత్యం చాల ముఖ్యం’ అని బైడెన్ అన్నారు. 

ఉక్రెయిన్ ప్రజలు ధైర్యంతో పోరాడున్నారు.. రాబోయే కొద్ది రోజులు వారికి కఠినంగా ఉంటాయని బైడెన్ చెప్పారు. రష్యా దళాలు కీవ్ నగరాన్ని చుట్టుముట్టవచ్చు.. కానీ ఉక్రెయిన్ ప్రజల మనసులను పుతిన్ ఏనాటికి కూడా గెలుచుకోలేదని బైడెన్ చెప్పారు. స్వేచ్ఛా ప్రపంచం సంకల్పాన్ని ఎప్పటికీ కూడా ఆయన బలహీనపర్చబోడని బైడెన్ తెలిపారు.

పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే