Russia Ukraine War: ఏడో రోజూ బాంబుల మోత.. ఖార్కివ్‌లో 21 మంది దుర్మరణం.. ప్రసూతి కేంద్రంపైనా దాడి

Published : Mar 02, 2022, 12:46 PM ISTUpdated : Mar 02, 2022, 12:55 PM IST
Russia Ukraine War: ఏడో రోజూ బాంబుల మోత.. ఖార్కివ్‌లో 21 మంది దుర్మరణం.. ప్రసూతి కేంద్రంపైనా దాడి

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. నిన్న ఖార్కివ్ నగరంపై బాంబులతో దాడి చేయగా.. ఇవాళ ఏకంగా రష్యా పారాట్రూపులు అక్కడ దిగాయి. ఖార్కివ్‌పై బాంబుల దాడిలో 21 మంది మరణించారు. కాగా, ఈ రోజు రష్యా ఆర్మీ ప్రసూతి కేంద్రాన్నీ వదల్లేదు. ఆ కేంద్రంపై రష్యా దాడిలో ఇద్దరు దుర్మరణం చెందారు.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడులు చేస్తూనే ఉన్నది. బాంబులు వేయడంలో వెనకడుగు వేయడం లేదు. బుధవారం ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధం(Warలో ఖార్కివ్‌(Kharkiv) నగరంపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఈ రోజు 21 మంది మరణించారు. కాగా, సుమారు 100 మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా, ఖార్కివ్‌లోని ఓ మెటర్నిటీ కేంద్రంపై వైమానిక దాడులు చేయడం బాధాకరంగా మారింది. ఖార్కివ్‌లోని జైటోమిర్‌లోని మెటర్నిటీ హోంపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌లో కీవ్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ ఈ రోజు బాంబులతో దద్దరిల్లిపోతున్నది. నికోలేవ్ ఏరియా మొత్తం బాంబుల కారణంగా ఏర్పడ్డ పొగదుప్పటితో కప్పుకుపోయింది. ఖెర్సాన్ సిటీ మొత్తంగా రష్యా ఆర్మీ అధీనంలోకి వెళ్లినట్టు తెలిసింది. దీన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించలేదు. కానీ, రష్యా ఆర్మీ మాత్రం ఖెర్సాన్ సిటీని తాము స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.

రష్యా దాడులు ఏడో రోజుకు చేరడంతో వాట్సాప్‌లో హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను, ముఖ్య మైన సమాచారం, సలహాలను ప్రజలకు ఈ హెల్ప్‌లైన్ ద్వారా చేరవేయనుంది. నిన్న రష్యా మొత్తం ఖార్కివ్‌పైనే ఫోకస్ పెట్టింది. షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ రోజు ఏకంగా రష్యా పారాట్రూపులు ఈ నగరంలో కాలుమోపాయి. రష్యా వైమానిక దళ సిబ్బంది ఖార్కివ్ నగరంలో దిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వారు దిగీదిగగానే స్థానిక హాస్పిటల్‌ను ధ్వంసం చేశారని వివరించింది. ఇక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతున్నదని పేర్కొంది.

కాగా, ఉక్రెయిన్ పై దాడులకు గాను రష్యా మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  మంగళవారం నాడు స్టేట్ ఆఫ్ యూనియన్ లో ప్రసంగించారు.  ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ దాడి గురించి ప్రసంగించారు. ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తగిన బుద్ది చెబుతామని బైడెన్ హెచ్చరించారు. రష్యా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో రష్యా సైన్యాన్ని  బలహీనపరుస్తామని ఆయన తేల్చి చెప్పారు.

రష్యా క్లెప్టోక్రాఫ్ట్ పాలకవర్గ సభ్యులతో బైడెన్ నేరుగా మాట్లాడారు. మీ విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ జెట్‌లను అమెరికా స్వాధీనం చేసుకొంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రష్యా దాడులు చేస్తున్నా కూడా ఉక్రెయిన్ ప్రజలు కూడా రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని బైడెన్ అభినందించారు.  మంగళవారం నాడు రాత్రి కూడా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా దాడులను ఉక్రెయిన్ నిలువరించిందన్నారు. 

రష్యా దళాలు కీవ్ నగరాన్ని చుట్టుముట్టవచ్చు. కానీ ఉక్రెయిన్ ప్రజల హృదయాలను , ఆత్మలను పుతిన్ ఏనాటికి కూడా పొందలేడని బైడెన్ చెప్పారు. స్వేచ్ఛా ప్రపంచం సంకల్పాన్ని ఎప్పటికీ కూడా ఆయన బలహీనపర్చబోడని బైడెన్ తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులను దుర్మార్గమైనవిగా ఆయన పేర్కొన్నారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందన్నారు.అమెరికా గగనతలంలోకి రష్యా విమానాలపై నిషేధం విధిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు.ఉక్రెయిన్ ను  రష్యా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ను రష్యా బలహీనపర్చలేదని బైడెన్ అభిప్రాయపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే